సహనం పెంచేను బంధం

                     సహనం పెంచేను బంధం

COUPLE-
COUPLE-

భార్యా భర్తలు ప్రేమగా మెలగాలి. కనీసం రోజుకు ఒక్కసారైనా ఆత్మీయంగా పలకరించాలి. మంచి మంచి కబుర్లు కలిసి పంచుకోవాలి. ఆమె వ్యవహారశైలిని మెచ్చుకోవాలి. ఆమెపై మీకెంత ప్రేముందో మీ చేతలలో, మీ మాటలలో తెలియాలి. కీచులాటలు, వాదులాటలు మీ బంధం ముందు ఎంతో చిన్నవని గ్రహించాలి.
మనం పెళ్లి పందిరిలోకి ప్రవేశించిన వెంటనే ఏదో పరలోకంలోకి ప్రవేశించినంత అనుభూతి కలుగుతుంది. రంగురంగుల లైటింగ్‌ డెకరేషన్లు, కోరినన్ని తినుబండారాలు, మెరిసే దుస్తులు, నగలతో ఆహుతుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక వధూవరులను చూసేందుకు రెండు కళ్లు చాలవ్ఞ. పెళ్లి మండపాల డెకరేషన్లకే లక్షల రూపాయల్ని ఖర్చుచేస్తున్నారు. ఇక విందు, దుస్తుల గురించి చెప్పనక్కర్లేదు. ఇంత ఖర్చు, ప్రయాస ఎందుకు? దంపతులు ఆనందంగా వందేళ్లు బతకాలనే కదా. మరి వారు ఎంత ఆనందంగా, మమతలతో ఉంటున్నారు?పెళ్లి ఎంత త్వరగా జరుగుతున్నాయో అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు.

ఆలు మగల మధ్య అల్లుకున్న అనురాగబంధం పునాదులపైనే మానవ సమాజ నిర్మాణం, మనుగడ, మానవ సంబంధాల వికాసం ఆధారపడి ఉంటాయి. అహంకారం, స్వార్థం, సంకుచిత స్వభావం, గృహహింస, మాయమవ్ఞతున్న మనిషితనం…ఈ విపరీతావరణంలో సున్నితమైన మానవీయ సంబంధాలు వికసింప జేయడానికి, ఎవరికి వారు ఎంతో కృషి చేయాలి. వివాహం సామాజిక, ఆర్థిక, సంస్కృతీ సంబంధాలను ప్రభావితం చేసే అత్యున్నత వ్యవస్థ. భార్యాభర్తలు తమకు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇద్దరూ ఒకరినొకరు స్పష్టంగా వినగలిగితే, పరస్పర ఇష్టాలు తెలుస్తాయి. ఒకరికొకరు అర్థమవ్ఞతారు. ఫలితంగా ఈ బంధం మరింత గట్టిపడుతుంది. నిత్యం మనం ఎన్నో జంటలనూ చూస్తూంటాం.

వారిలో అన్ని వయస్సులవాళ్లూ ఉంటారు. సుదీర్ఘకాల వైవాహిక జీవితంలో ఎన్నో అనుభవాలు సంతరించుకున్న వారు, ఎన్నో ఆలోచనలు కలబోసుకున్నవారు ఉంటారు. ఆదర్శనీయమైన, ఆచరణయమైన జీవనశైలితో రోల్‌మోడల్స్‌గా నిలిచినవారు కూడా ఉంటారు. కొందరు తమ జీవితానుభవాలతో భావితరాలకు మార్గద ర్శనం చేస్తూ ఎన్నో హితోక్తులు చెబుతూఉంటారు. అయితే యాభై, అరవైఏళ్లుగా కలిసిజీవిస్తున్న ఆలుమగ లను ఇన్నేళ్లు కొంగుముడితో వారు ప్రతీక్షణం ఆనందంగా గడిపారా? అని ఎవరూ అడగకపోవచ్చు… అడి గితే వచ్చే జవాబులు మనం ఊహించగలం. అవేమిటో తెలుసుకుని మసలుకొందాం.
మాటలతో గొడవ రాకుండా చూసుకోవాలి : కోపం ఒక భావోద్వేగం. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, ఏదైనా అసౌకర్యం కలిగినా, ఎదుటివారి ప్రవర్తన చికాకు కలిగించినా, కోపగించడం మానవ నైజం. ప్రతికూల పరి స్థితుల పట్ల సహజస్పందనే కోపం. ఆరోగ్యపరంగానే కాదు వృత్తిపరంగా, సమాజపరంగా అనర్థహేతువ్ఞ. కోపం తాలూకు స్పందనలు, చేష్టలు ఎన్నోరకాలుగా ఉంటాయి. కోపం ఎందుకు వస్తోందో తెలుసు కాబట్టి దాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలి. అవతలి వారు కోపంతో ఊగిపోతున్నప్పుడు ఇవతలవారు మౌనం వహించడం మేలు. కోపిష్టి మనుషులతో ఇంటా, బయటా వేగడం కష్టమే. మనకే కాదు ఎదుటి వారికీ కోపం వస్తుంది. అలాంటప్పుడు ఇద్దరిదీ ఒకటే పరిస్థితి అయితే పరిష్కా రం ఏమిటి?

సాంసారిక జీవితంలో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అపార్థాలు, అపోహలు, చిన్నచిన్న తగా దాలు, మనస్పర్థలు, అలకలు, కోపాలు, తాపాలు తలెత్తడం అతి సహజం. గిల్లికజ్జాలు కూడా లేకపోతే వైవాహిక జీవితం చప్పగా…మొక్కుబడి తంతుగా ఉంటుంది. ఒక్కోసారి అతిచిన్న విషయానికే కోపతాపాలు వస్తుంటా యి. మనస్తాపం కల్గిస్తాయి. సన్నివే శాన్ని సాగదీసే ‘మాట్లాట కాస్తా ‘పోట్లాట అవ్ఞతుంది. చిన్న విష యమే కదాని వదిలేస్తే చినుకు చినుకు గాలివానగా మారినట్లు చిన్న చర్చ చివరికి పెద్ద రచ్చగా మారితే మాటామంతీ బంద్‌. అహం దెబ్బతినడంతో నిలువెల్లా అసహనం….చివరికి జనం దృష్టి లో పలుచనకావడం తప్ప సాధించేది ఏం ఉంటుంది?
ఎవరో ఒకరు తగ్గాలి: ఆలుమగలు ఇద్దరూ ఒకేసారి కోపంతో ఉండకూడదు. తన కోపమే తన శత్రువ్ఞ. తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఒకరు కోపంగా ఉన్న ప్పుడు మరొకరు మౌనంవహిస్తే పరిస్థితి అదుపులో ఉంటుం ది. ఇద్దరూ ఒకే సారి కోపంతో అరుచుకుంటే ఇరుగుపొరు గుకి అలుసవ్ఞతారు. హాట్‌టాపిక్‌ అవ్ఞతారు. కోపం తెచ్చుకో వద్దని చెప్పడం సులు వే. ఇది వినడానికి ఎంతోబాగుంటుం ది. కానీ ఆచరణే కష్టం. ఎందుకంటే చికాకులకు ఏ స్వీట్‌ హోమ్‌ అతీతంకాదు. కోపం అంటువ్యాధి వంటిది. మనిషి నుంచి మనిషికి సోకుతుంది. దుష్ప్రభావం కల్గిస్తుంది. అది గతం నుంచి వర్తమానానికి కూడా ప్రస్తావించగలదు. బాధ ను మరచిపోవచ్చు. కాని కాలాన్ని అదుపులో ఉంచడం కష్ట మే. కోపానికి జవాబు కోపమే కావచ్చు. కాకపోతే మనస్తాపా లు చోటు చేసుకుంటాయి. ఇది అంతా మామూలే కావచ్చు. మరి కోపాలు ఎలా చల్లారతాయి…? పట్టరాని కోపంతో ఊగిపోతుంటే మరో పక్క ఎవరో అదే పనిగా నవ్ఞ్వతూ పలకరిస్తుంటే ఏం జరుగు తుంది?కోపం చల్లారవచ్చు లేదా తారాస్థాయికి చేరనూవచ్చు.
ప్రేమతో సర్దిచెప్పుకోవాలి : ఒకపక్క ఇంట్లో వాతావరణం ఉద్రేకపూరితంగా ఉంటే మరోపక్క ఆలుమగలు అరుచుకోవ డం అగ్నికి ఆజ్యంపోయడమే. ఇద్దర్లో ఎవరో ఒకరు కోపం గా లేకపోతే అరుచుకునే పరిస్థితి ఉండదు. సరసాలు, సరా గాలు నిండినచోట రుసరుసలు, ఉక్రోషాలు మొదలవ్ఞతాయి. కంఠస్వరాలు తీవ్రమవ్ఞతాయి. అరుపులు పెరుగుతాయి. మాటలు ఈటెల్లా విసురుకుంటారు. ఎత్తిపొడుపులకు దిగుతా రు. స్థిమితాన్ని కోల్పోతారు. ఇదంతా అవసరమా..? ఆలోచించండి. అరచి అనర్థం తెచ్చుకోవడం ఎందుకు? విమర్శించదలిస్తే ఆ పనిని ప్రేమపూర్వకంగా చేయాలి. భార్యా భర్తల మధ్య అలకలు, తగువ్ఞలు, బుజ్జగింపులు ఇవన్నీ సహజం. మాటకు మాట అంటే జరిగేది వాగ్యుద్ధమే. ప్రపంచ పోకడ గమనించాలి. ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకు నేకన్నా ప్రపంచ పోకడల్ని గమనించండి.

కొద్దిపాటి శ్రద్ధ, జాగ్రత్త వహిస్తే మీది కలతలు లేని కాపురమే అవ్ఞతుంది. సంతోషం, ప్రేమ, పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక ఉన్నతి సామా జిక ప్రతిపత్తి ఎన్ను కున్న రంగంలో వికాసం ఇవన్నీ సమ కూరాలంటే ఎవరికైనా భాగస్వామి తోడ్పాటు అవసరం. వైవాహిక జీవితం అంటే ఒకేలా ఆలోచించడం కాదు. ఆలుమగలు ఇద్దరూ కలిసి ఆలోచించడం. కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవడం. పొరపాటునో, గ్రహపాటునో ఏదో జరిగింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆవేశం హద్దులు దాటింది. మీరే ‘సారీ చెప్పవచ్చు… మన్నింపును కోరడం చిన్న తనం కాదు..తప్పు తనదే అయినప్పుడు భర్త తన అహాన్ని, పురుషాధిక్య భావనని పక్కనపెట్టి భార్యకు సారీ చెబితే అది ఆమెకు ఎంతో స్వాంతననిస్తుంది. ఊరడింపు బలవర్థక ఔషధంలా పనిచేస్తుంది. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. మాటమాట పెరిగితే జగడాలు. అతిగా మాట్లాడే వారే ఎక్కువగా పొరపాటుచేస్తుంటారు.