సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం

సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం
భారతదేశంలో సమాంతరంగా చెలామణి అవ్ఞతున్న నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో గత 10 రోజులుగా దేశంలో సామా న్యులు, రైతాంగం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పాతనోట్లను బ్యాంకు పోస్టాఫీసులలో మార్చుకోవాలని అది రూ.4వేల వరకు మాత్రమే అవకాశం కల్పించడంతో నవంబర్ 10 నుండి బ్యాంకుల వద్ద ప్రజల పేద, మధ్య, ధనిక అనే తేడాలేకుండా కొండవీటి చాంతాడులా నిలబడి నానాతంటాలు పడుతున్నారు. నగదు మార్చుకోవటాన్ని ఈ నెల 18 నుండి 2వేలకు తగ్గించారు. ఇచ్చే 4వేలలో 2వేల రూపా యల విలువగల కొత్త నోట్లు ఇవ్వటంతో ఆ నోటుకు మార్కెట్లో చిల్లర లేదు. ఎటియంలు పనిచేయడం లేదు. కొత్త రూ. 2000 నోటుకు అనుకూలంగా ఎటియంలో మార్చడా నికి రెండు, మూడు నెలలు పడుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ చెబుతుంది.
పెద్దనోట్ల రద్దు చేయడం అంటే మూల్గే నక్కపై తాడి పండు పడినట్లుగా కరువ్ఞ కాటకాలకు, అప్పుల ఊబిలో కూరుకొని పోతున్న రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో 185వ్యవసాయ మార్కెట్లు, 100కు పైగా కూరగాయలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్లలో రైతులు తమ ఉత్పత్తులను తీసుకొస్తూ అమ్ముకొని నగదు డబ్బులను తీసుకుంటూ వారు చేసిన బ్యాంక్ అప్పులను కట్టుకోవ డం, మిగిలిన డబ్బును వారి సేవింగ్ ఖాతాలో డబ్బులు వేసు కుంటూ దైనందిన జీవితం గడుపుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో10జిల్లాల్లో 9జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో 272 సహకార బ్యాంక్ బ్రాంచీ లు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల 22వేలకుపైగా సన్నా, చిన్న, మధ్య, ధనిక రైతులున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు 50 శాతం రుణాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు ( ఎరువ్ఞలు, మందులు, విత్తనా లు) ఎల్టీలోన్స్ (డ్రిప్పు, పైప్‌లైన్స్, మోటార్లు, ట్రాక్టర్లు, ల్యాండ్ అభివృద్ధి) డైరీ ఫామ్స్, పండ్ల తోటలు, చేపల సొసైటీలకు, చేతివృత్తుల సోసైటీలతోపాటు బంగారంపైరుణాలు అందిస్తున్నారు. జిల్లా సహకార బ్యాంకుల పరిధిలో 2500కుపైగా ప్రాథమిక సహ కార పరపతి సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతంలోని రైతాంగానికి రుణాలు అందిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 10వేల కోట్లకుపైగా రూపాయలు అప్పు రూపేణ అందిస్తున్నారు.
రైతుల పంటలు (ఖరీఫ్, రబీ)సీజన్లోచేతికి అందగానే మార్కెట్లో అమ్ముకొని పంటలకు తీసుకున్నస్వల్ప, మధ్యకాల రుణాలు చెల్లించ డంతో పాటు సేవింగ్ ఖాతాలో జమ చేసుకుంటూ వారి ఇతర అవసరాలను తీర్చుకుంటారు. నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం వారు భారతీయ రిజర్వుబ్యాంకు నోటిఫికేషన్ నెం.2652 ద్వారా చట్టబద్ధమైన రూ.500, రూ.1000నోట్ల చెలామణిని ఉపసంహ రించిన నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో పొందుపర్చబడిన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించు తు న్న బ్యాంకులు, పోస్టాఫీసులు, ట్రెజరరీలు రద్దు చేయబడిన నోట్లు డిపాజిట్ చేయడం ద్వారా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజర్వుబ్యాంక్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో డిసిసిబిలు అన్ని శాఖల ద్వారా తమ ఖాతాదారుల సేవింగ్స్, కరెంట్ ఖాతాలు చెలామణి కోల్పోయిన వారు రూ.500, రూ.1000 నోట్లను జమచేసుకొనటం ద్వారా ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిజర్వుబ్యాంక్ నిబంధనలను పాటిస్తూ బ్యాంకింగ్ సేవలను నవంబర్ 14 వరకు ఖాతాదారులకు ఖాతాలలో సొమ్ము జమచేయడం ద్వారా కౌంటర్లో మార్చుకోవడం ద్వారా తమ ఖాతాదారులకు సేవలందిచారు.
ఆందోళన బాటలో బ్యాంకు సిబ్బంది రిజర్వుబ్యాంక్ ఇచ్చిన సర్క్యులర్ డిజియం (పిఎల్‌జి) నెం. 1273/10.27.00/2016-17 తేదీ 14.11.2016 ద్వారా సహ కారబ్యాంకులో నగదు మార్పిడి డిపాజిట్లను తీసుకోరాదని ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రంలో బ్యాంక్ ఖాతాలు గల 2 లక్షల 22వేల రైతాంగం తీవ్ర ఇక్కట్లకు గురవ్ఞతున్నారు.
రెండవ వైపు అర్బన్ బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెట్స్కు, పోస్టాఫీసులకు, పెట్రోల్ బంక్‌లకు, ఇతర కార్పొరేషన్లకు కూడా అవకాశం కల్పించి డిసిసిబి లకు కల్పించకపోవడంలో గూఢార్థం తెలియరావడం లేదు.రిజర్వు బ్యాంకు తీసుకున్నఈ నిర్ణయం సమంజసమైనది కాదని వెంటనే ఉపసంహరించుకోవాలని తిరిగి డిపాజిట్లకు, నగదు బదిలీలకు ఆదేశాలు ఇవ్వాలని అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఆందోళన లకు పిలుపునిచ్చింది.
నవంబర్ 18న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నవంబర్ 22న రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో సామూహిక ధర్నా, 25న తెలంగాణ రాష్ట్రంలో అన్ని సహకార బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారు. కష్టాల కడలిలో రైతులు దేశంలో నల్లకుబేరులను, బ్యాంకుల నుండి వేల కోట్లు తీసుకొని ఎగవేతదారులపైన విదేశాలలో అక్రమంగా కూడబెట్టిన వారిపైన చర్యలు తీసుకోకుండా వారికి రాయితీలు కల్పిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలను, రైతులను కంటికి కనుకులేకుండా కష్టాలకు గురి చేయడం ఎంతవరకు సబబు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి, మిర్చి, ధాన్యం, (వరి, మొక్కజొన్న) పండ్ల, కూరగాయల మార్కెట్ లలో, రైతుబజార్లలో లావాదేవీలు పూర్తిగా నిల్చిపోయాయి.
వ్యాపా రులు, వ్యవసాయఉత్పత్తుల లావాదేవీలు పూర్తిగా నిలిపివేశారు.
ఐకెపి, మార్క్‌ఫెడ్ సివిల్ సప్లయీస్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెపుతున్నా ప్రకటనలకే పరిమితమైంది. రైతాంగం ఆరు కాలం కష్టించి పండించిన పంటలకు కొనేవారు లేక అరకొర కొను గోలైనప్పటికి నగదు చెల్లింపు లేక రైతాంగం తీవ్రకష్టాలకు గురవ్ఞతు న్నారు. తక్షణమే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం ముందుకొచ్చి బ్యాంకుల ద్వారానైనా కొనుగోలు చేయాలని రైతాం గం పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు.