సహకరించే కాంగ్రెస్‌తో పొత్తు మంచిదే

chandra babu, rahul
chandra babu, rahul

అమరావతి: సహకరిస్తానన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంలేదు అని టిడిపి అధినేత, ఏపి సియం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన..తెలంగాణ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్‌తో పొత్తు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో తాను ప్రచారంలో పాల్గొనడం వలనే అక్కడ పోటీ వాతావరణం ఏర్పడింది. కేంద్రం నుంచి మోది, తెలంగాణ నుంచి కేసిఆర్‌లు ఏపి రావడం మంచిదేనని..గందరగోళం సృష్టించడానికే వస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా ఇంకా చాలా జరగబోతున్నాయని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. ఏపికి బిజెపి సహకరించడం లేదని ..సహకరిస్తున్న కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంలేదు అని చంద్రబాబు అన్నారు.