సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘లా’

LAW
LAW

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘లా’

సమాజంలో ప్రతి మనిషికి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి.. అలా జీవిచటం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి.. అనే కథాంశంతో రూపొందిన మూవీ లా ..లవ్‌ అండ్‌ వార్‌ అనేది ఉపశీర్షిక.. పూర్తిస్థాయి క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ షూటింగ్‌ంతా కంప్లీట్‌ చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.. ఈ సందర్బంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు.

హీరో కమల్‌ కామరాజ్‌ మాట్లాడుతూ, హీరోగా కమ్‌ బ్యాక్‌ మూవీ అనగానే చాలా ఆలోచించాను.. కానీ దర్శకుడు గగన్‌గోపాల్‌ చాలా డిటైల్డ్‌గా కథ చెప్పారు. లా అనే టైటిల్‌ కూడ కథలోంచే వచ్చింది.. సినిమా కథనం చాలా సీరియస్‌గా సాగుతుంది.. ఈ టైటిల్‌ అనగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. మన జీవితాల్లో బాగా విన్పించే పదం కాబట్టి ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతారనిపించిందన్నారు. విజయవాడలో ఎక్కువభాగం షూట్‌చేశామన్నారు. కార్యక్రమంలో మౌర్యాణి, దర్శకుడు గగన్‌ గోపాల్‌, తదితరులు మాట్లాడుతూ, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం ను త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. పూజా రామచంద్రన్‌, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్‌, రవి మాట్లాడి కీలకపాత్రలు పోషించారు.