‘సవ్యసాచి’ విడుదల తేదీ ఖరారు

SAVYASACHI-
SAVYASACHI-

సవ్యసాచి విడుదల తేదీ ఖరారు

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సవ్యసాచి విడుదల తేదీ ఖరారు అయ్యింది . ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈచిత్రం నవంబర్ 2న ప్రేక్షకులముందుకు రానుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఒక్క సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వారంలో ఈ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లానున్నాడు చైతు దాంతో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుంది.

ఈ చిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం తోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కానుంది. సీనియర్ నటులు మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి ,నాగ చైతన్య ల కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.