సర్వీస్‌ రివాల్వర్‌తో అడిషనల్‌ ఎస్పీ బలన్మరణం

Rajesh sahni
Rajesh sahni

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌(ఎటిఎస్‌)లో అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్‌ సాహ్ని సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డారు. తన కార్యాలయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రాజేశ్‌ సాహ్ని గదిలో సూసైడ్‌ నోట్‌ ఏదీ పోలీసులకు లభ్యం కాలేదు. రాజేశ్‌ మృతదేహాన్ని శవపంచానామాకు పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు.