సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల ఎన్నిక ఏకగ్రీవం

panchayat elections
panchayat elections

హైదరాబాద్‌: పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఖరారవడం, రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. తాజాగా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌ సర్పంచ్‌గా బాసాని వేలాంగిణి మేరిని ఎన్నుకున్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా వంగూరు మండలం చాకలి గుడిసెలు గ్రామంలో టిఆర్‌ఎస్‌ బలపరచిన అభ్యర్ధులను సర్పంచ్‌గా పూజిత, ఉప సర్పంచుగా సత్యనారాయణలను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్‌ మండలం రాజారం తండా సర్పంచ్‌గా సరిత, ఉప సర్పంచ్‌గా చంద్రునాయక్‌ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.