సర్కారు ఇళ్లకోసం ఇంకా ఎన్నేళ్లు?’

Housing
Housing

సర్కారు ఇళ్లకోసం ఇంకా ఎన్నేళ్లు?’

 

జూన్‌ 2014 వరకు తెలంగాణలోని పేదలకు పాలక వర్గాలు నిర్మించిన గృహాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం మాత్రం భారీ వ్యయంతో కూడుకున్నదని చెప్పవచ్చు ఇటీవలనే విడుదలైన సామాజిక, ఆర్థిక, కులాల గణాంకాలు 2011 నివేది కలో గ్రామీణ ప్రాంతాల్లోని 56.44 లక్షల కుటుంబాల్లో 36లక్షల కుటుంబాలకు సంబంధించి 4.41లక్షల కుటుంబీకులు అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నా రు. ఆ అద్దె ఇళ్లలో రెండుగదులు మాత్రమే ఉంటున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గృహాలలో రెండు పడక గదు లు, ఒక హాలు, వంటగది, బాత్‌రూమ్‌, టాయిలెట్‌ ఉంటాయి. పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న పథకం 1983లో ప్రారం భమయింది. అప్పటి నుంచి గత ప్రభుత్వాలు వివిధ పథకాల కింద 42.27 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు.

ఈ ఇళ్లన్నీ ‘అగ్గిపెట్టెలు మాదిరిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఇళ్లల్లో ఒకేగది, వంటగదికి కొంత స్థలం మాత్రమే ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావి స్తోంది. ఇళ్లులేని వారికి డబుల్‌బెడ్‌ రూమ్‌లు, హాలు, కిచెన్‌ రూమ్‌ లతో కలిపి చాలా గౌరవప్రదమయిన నీడగూడుగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అర్హులయిన వారందరికీ ఈ విధంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే కనీసం రెండు మూడు దశాబ్దాలయినా పడుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇది నిర్విరామ నిరంతర కార్యక్రమంగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండున్నర ఏళ్లలో మంజూరయిన 2.6 లక్షల ఇళ్లలో 1500 డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు మాత్రమే నిర్మాణమ య్యాయని మరో 10వేల గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 17,600 కోట్ల రూపా యలు కేటాయించింది. హుడ్కోనుంచి 15,900 కోట్ల రూపాయ ల రుణం కూడా తెచ్చింది.

ఈ పథకం వేగవంతం కావడానికి కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇసుకపై ఉన్న నిబంధనలు సరళీకరిస్తారు. అలాగే బస్తా సిమెంట్‌ రూ. 230కే సరఫరా అయ్యేలా 31 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటారని గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణరెడ్డి చెప్పారు. తెలంగాణ గ్రామీణప్రాంతాల్లో మొత్తం 56,43,739 కుటుం బాలున్నాయి. వీటిలో స్వంతంగా ఇళ్లున్నవారు 51,96,080. 4,09,346 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. 2004 వరకు పేదలకు నిర్మించిన ఇళ్లు 17,34,826. 2004 ఉంచి 2014 వరకు నిర్మించిన ఇళ్లు 24,91,870. రాష్ట్రంలోని పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు, ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో 3,91,399 పక్కాఇళ్లు, 83,892 కచ్చా ఇళ్లు ఉన్నాయి. నిజా మాబాద్‌లో 45,9095 పక్కాఇళ్లు, 71,500 కచ్చా ఇళ్లు, కరీంన గర్‌లో 689426 పక్కాఇళ్లు, 61704 కచ్చా ఇళ్లు ఉన్నాయి. మెదక్‌లో 529658 పక్కాఇళ్లు, 89798 కచ్చా ఇళ్లుఉన్నాయి. రంగారెడ్డిలో 501538 పక్కాఇళ్లు, 822 కచ్చా ఇళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 683192 పక్కాఇళ్లు, 51772 కచ్చా ఇళ్లు ఉన్నాయి. నల్గొండలో 736,692 పక్కాఇళ్లు, 22904 కచ్చాఇళ్లు ఉన్నాయి. వరంగ్‌లో 574334 పక్కాఇళ్లు, 141134 కచ్చా ఇళ్లు ఉన్నాయి. ఖమ్మంలో 494538 పక్కాఇళ్లు, 54165 కచ్చా ఇళు ్లఉన్నాయి. రాష్ట్రంమొత్తంమీద 50,59,872పక్కాఇళ్లు, 577691 కచ్చాఇళ్లు ఉన్నాయి. వీటిలో ఒకే గదితో ఉన్న ఇళ్లు 756416 కాగా, రెండు గదులు ఉన్న ఇళ్లు 28,19,737 ఉన్నాయి.

-పి.వి.ఆర్‌.మూర్తి