సరిహద్దు రేఖ వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు

Pak Army
Pak Army

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మళ్లీ భారత్‌పై కాల్పులకు తెగపడింది. సరిహద్దు రేఖ వద్ద ఆదివారం పాక్‌సైన్యం కాల్పులు జరిపింది. బ్రిక్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో పాక్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.జమ్ముకాశ్మీర్‌ లోని మాన్‌కోట్‌ సెక్టార్‌ వద్ద భారత జవాన్లపై ఉన్నట్టుండి కాల్పులు మొదలుపెట్టడంతో అప్రమత్తమైన భారత సైనికులు ఎదురు దాడికి దిగారు. పాక్‌ కవ్వింపు చర్యలకు భారత సైన్యం ధీటుగా జవాబిచ్చిందని భారతసైన్యం ప్రకటించింది. అయితే పాకిస్థాన్‌ ఇలాంటి కవ్వింపు చర్యలకు ఈ మధ్య తరచు పాల్పడుతోంది. రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో ఆగస్టు 27న ఉదయం పాక్‌సైన్యం ఫైరింగ్‌ నిబంధనలను ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. అదే రోజు పూంచ్‌ సెక్టార్‌లోనూ నిబంధనలను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. ఆగస్టు 31న రాజ్‌కోట్‌లోని నౌషెరా సెక్టార్‌లోనూ పాకిస్థాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. మెందార్‌, మాన్‌కోట్‌ రెండు ప్రాంతాల్లో పాక్‌సైన్యం తరచు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధీటుగా జవాబిస్తున్నామని, అందుకు తగిన చర్యలు తీసుకున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ కాల్పులు మొదలు పెట్టడంతోనే భారత సైనికులు ప్రతి కాల్పులకు దిగి గట్టి జవాబు చెప్పారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బక్రీద్‌ సంధర్భంగా ఇరు దేశాల సైనికులు సరిహద్దు రేఖ వెంబడి పండగ శుభాకాంక్షలు తెలుపుకోలేదని తెలిపారు.