సరిహద్దుల్లో ఉగ్రవాదం సమసినట్లేనా?

pak terrarists
Terrarists (File)

సరిహద్దుల్లో ఉగ్రవాదం సమసినట్లేనా?

ఉగ్రవాదం ప్రపంచదేశాలను శాసించే స్థితికి ఎది గింది. అటు అగ్రరాజ్యాన్ని, ఇటు పెద్ద రాజ్యాల ను మరోవైపు ఆసియా, ఆఫ్రికాదేశాలను పీడిం చుతున్న సమస్య. ఆ ఉగ్రవాదాన్ని నమ్ముకొని కొందరు బతుకుతున్నారు. అలాంటి దేశాలలో లిబియా సౌదీ అరే బియా, ఇరాక్‌, పాకిస్థాన్‌ లాంటి దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఆయాదేశాల మద్దతుతోపాటు ఆర్థిక, మిలిటరీ సహాయాన్ని పెద్ద దేశాల నుండి లేదా మిత్ర దేశాల నుండి పొందడమే కాక చుట్టుపక్కల దేశాలను ‘భూతంలా చూపిస్తూ బతుకుతుంటాయి. ఆ కోవకు చెందినదే పాకిస్థాన్‌. ఈ దేశం 1947 నుండి ఇండియాను పెద్ద దేశంగాను, మిలిటరీ ఆయుధాలు న్యూక్లియర్‌ దేశంగా చూపిం చి తన నుండిరక్షణ కావాలని అప్పులు, ఆయుధాలు, గ్రాంటులు తెచ్చుకొంటోంది. గత కొన్ని ఏళ్లుగా పాకిస్థాన్‌ 1962 నుండి నేటి వరకు అమెరికా నుండి లక్షల కోట్ల రూపాయలు మిలిటరీ, ఆర్థిక శాఖ నుండి పొందింది. కాస్తంత వెసులుబాటును తన స్వప్రయోజ నాలతో మనదేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్టులను పెంచి పోషించి, శిక్షణ ఇచ్చి భారతదేశ సరిహద్దుల వెంబడి శాంతి రక్షణ చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి దాడులను చేస్తుంది. యుపిఏ ప్రభుత్వ హయాంలో భారత ప్రభు త్వం పాకిస్థాన్‌ల మధ్య సయోధ్య బాగానే ఉండేది. ఎన్‌డిఏ/ బిజెపి ప్రభుత్వాలు జమ్మూకాశ్మీరులో పరిస్థితులను తనకనుకూలంగా మలచుకొని కాశ్మీరు ఎన్నికలలో సీట్లు పొంది పి.డి.పి సంకీర్ణ ప్రభు త్వంలో చేరింది. అప్పటి నుండి కేంద్రంలోని బిజెపి కాశ్మీరు రాష్ట్రం లోని బిజెపిల మద్య పొసగక, ఎన్నో ప్రయత్నాల అనంతరం కక్ష పూరితచర్యలకు పాకిస్థాన్‌ పాల్పడింది. దానితో రెండుదేశాల మధ్య యుద్ధవాతావరణం పదేపదే ఘర్షణలుపడడం జరుగుతుంది. కాశ్మీ రులోని అజాద్‌ కాశ్మీరు సమస్యను లేదా ఆక్రమిత కాశ్మీరు సమస్య ను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులను తయారు చేసు కొన్న పాకిస్థాన్‌ వారినే భారతదేశం మీదకు దాడులకు పంపిస్తుంది. దానితో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు బెడిసి కొట్టాయి. పాకిస్థాన్‌ గత 70 సంవత్సరాల నుండి భారతదేశాన్ని శత్రువ్ఞగా చూపించి మిలి టరీ సహాయాన్ని అమెరికా, చైనా, ఇంగ్లాండ్‌ల నుండి తెచ్చుకొం టుంది. చివరకు గత ఏడాది కూడా కాశ్మీరు సమస్యను ఎత్తి చూపి రెండు బిలియన్‌ డాలర్లు ఆర్థిక సహాయం,రెండు బిలియన్‌ల సైనిక సహాయాన్ని పొందింది.

ఎప్పుడూ భారతదేశాన్ని భయంకరశక్తిగా చూపించి సైనిక సహాయాన్ని పొందుతుంది. ఇది 1948 నుండి 2016 ఫిబ్రవరి వరకు అమెరికా నుండి 2048 బిలియన్‌ డాలర్లు పొందింది. చైనా అయితే ఏకంగా ఇండియా మీద దాడులు చేయడా నికే సహాయం అందిస్తోంది. చైనా సరిహద్దుల్లో రోడ్లు వేయడానికి మిలిటరీ ఎయిడ్‌240 బిలియన్లను ఇచ్చింది. ఇవి అన్ని చూస్తే భారతదేశంనే భూతంగా చూపించి వాడుకొంటుంది. మోడీ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల కాలంలో సరిహ ద్దుల్లో చొరబాట్లను సీరియస్‌గా తీసుకొని తిప్పికొట్టింది. పాకిస్థాన్‌ ఈ చొరబాట్లను ఉగ్రవాదదాడులను ప్రోత్సహిస్తుందని ఆధారాలు చూపించినా మానుకోవడం లేదు. పాకిస్థాన్‌ ఎప్పుడు నియంత్రణ రేఖ ఉల్లంఘనలకు పాల్పడడం కాశ్మీరులో అశాంతి, టెర్రరి స్టుల దాడులను ప్రోత్సహించుతోంది. కాశ్మీరులో పిడిపిఎ బిజెపి ప్రభు త్వాలకు అది నచ్చడం లేదు. చివరకు నార్త్‌వెస్ట్‌ ప్రాంటియార్‌ ఏరి యాల్లోని ఉరిసెక్టార్‌లో చొరబడి ఇండియా మిలిటరీ స్థావరాల మీద దాడులు చేయించింది. ఫలితంగా భారత్‌ నలుగురు ఉగ్రవాదులను కాల్చిచంపింది. కాని ఇంకాఉగ్రవాదులు, చొరబాటుదారులు జమ్మూ కాశ్మీరులోని పిడిపి ప్రభుత్వాన్ని ఎప్పుడూ సరిగ్గా పరిపాలించని వ్వకుండా గత ఆరు నెలలుగా కర్ఫ్యూలతో కాశ్మీరులో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉగ్రవాదులు ‘అజాద్‌ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి అటు అంతర్గత సమావేశాలలో, విదేశీ సమావేశాలలోను భారతదేశం యుద్ధవిరమణను ఉల్లంఘించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అజాద్‌ కాశ్మీరును స్వతంత్ర దేశంగా ప్రకటిం చమని యుఎన్‌ఒ లోను, భద్రతామండలిలో పాకిస్థాన్‌అధ్యక్షుడు కోరడం హాస్యాస్ప దంగా ఉంది. దానిని ఇండియా ఖండించి పాకిస్థాన్‌ను దౌత్య పరంగా ఏకాకినిచేసింది. సార్క్‌ దేశాల సమావేశాలను మోడీ బహి ష్కరించారు.

యుఎన్‌ఒలో భారతదేశ విదేశాంగ మంత్రి అజాద్‌ కాశ్మీరు భారత దేశంలోభాగమని సమర్థించుతూ మాటాడేరు. కాశ్మీ రు దుశ్చర్యలను ఎంతకాలం భరించాలి అనే బిజెపి పార్టీపరంగాను, ప్రధాని మోడీపరంగాను మెజారిటీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక వారు పాకిస్థాన్‌కు, పాకిస్థాన్‌ను ప్రేరిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని గోప్యంగా ఆలోచనలు చేసి దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నించారు. పాకిస్థాన్‌ ప్రేరేపితదాడులకు సరైన గుణపాఠం చెప్పకపోతే బాగుండదని సర్జికల్‌ అటాక్‌ను ప్లాన్‌ చేశారు. మోడీ ఆర్మీకి ఇచ్చిన అనుమతితో సర్జికల్‌ అటాక్‌ చేస్తామని అమె రికా అధ్యక్షుని సమ్మతితో పాకిస్థాన్‌ మీదదాడికి భారత్‌ పాల్పడింది. దీనితో మన ప్రధాని ప్రతిష్ట బాగా పెరిగింది. అందరు సమర్థిం చకపోయినా 80శాతం జనం మోడీచర్యలకు మద్దతు తెలుపుతు న్నారు. ఉగ్రవాదులు ఇండియా మిలిటరీ స్థావరాల మీద బాంబులు కాల్పులు చేయడంవలన భారత్‌ కూడా తన గౌరవ ప్రతిష్టలు నిలుపుకొనేెందుకు ఎల్‌ఒసి ఆక్రమిత కాశ్మీరులో కాల్పులు జరిపి సురక్షితంగా సైనికదళాలు తిరిగివచ్చాయి.

పాకిస్థాన్‌ చర్యలకు ఇండియా ధైర్యంగా మిలిటరీ చర్యలు జరపడం సబబే. లేనియెడల భారత్‌ ఏచర్యలు తీసుకోవడం లేద ని ఉగ్రవాదులు ఇంకా దాడులు చేయవచ్చు. దీని ద్వారా మానవ హక్కులు అజాద్‌ కాశ్మీరులో ఉల్లంఘనగా జవాబుచెప్పడం జరిగింది. దీనిని అమెరికా, ఇంగ్లాండ్‌, పశ్చిమదేశాలు సమర్థించాయి.

 

డాక్టర్‌ కె. విజ§్‌