బాల గేయం: సరదా .. సరదా..

పిల్లల కోసం పాట

Active Children
Children

ఆదివారం వచ్చింది
బడికి సెలవ్ఞ ఇచ్చారు
ఆలస్యంగా లేచాను
తలంటు స్నానం చేశాను
ఫలహారమ్మును తిన్నాను
స్నేహితులందరు వచ్చారు
బ్యాటు బంతి పట్టాము
మైదానానికి వెళ్లాము
క్రికెట్‌ ఆటను ఆడాము
తిరిగి ఇంటికి వచ్చాను
చేతులు కాళ్లు కడిగాను
అమ్మ అన్నం పెట్టింది
కోడికూర వండింది
ఎంతో రుచిగా తిన్నాను
కాస్త నిద్దుర పోయాను
నాన్న వచ్చి లేపాడు
బజారుకెళదాం అన్నాడు
బండి ఎక్కిపోయాము
షాపులు అన్ని తిరిగాము
సరదాగింటికి వచ్చాము

  • ఆదిమూలం చిరంజీవి, సిద్ధిపేట

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/