సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ప్రి టోర్నీకి దూరం

Saina Nehwal
లక్నో: బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌ నుంచి గాయంతో దూరమైంది. కాగా కాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేని కారణంగా సయ్యద్‌ మోడీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సైనా తాజాగా ప్రకటించింది. నిర్వాహకులకు లేఖ రూపంలో తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి కాలి గాయం బాదిస్తుందని,ఇంకా ఆ గాయం పూర్తిగా నయం కాలేదని, టోర్నీకి దూరం అవుతున్నట్లు పేర్కొంది.కాగా సయ్యద్‌ మోడి గ్రాండ్‌ ప్రి టోర్నమెంట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో సైనా తన నిర్ణయాన్ని చివరి నిముషంలో నిర్వాహకులకు వెల్లడించింది.గత ఏడాది చైనా ఓపెన్‌ ఫైనల్స్‌లో గాయంతో బాధపడిన సైనా ఆ తరువాత హాంకాంగ్‌ ఓపెన్‌కు దూరమైంది.కాగా డిసెంబర్‌లో జరిగిన బిడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌కు గాయం పూర్తిగా తగ్గకుండానే సైనా సన్నద్దమైంది.దీంతో ఆ గాయం మరోసారి తిరిగబెట్టడంతో గత కొంత కాలంగా సైనా విశ్రాంతి తీసుకుంటోంది.