సమ్మిళిత అభివృద్ధిలో చైనాతర్వాతే భారత్‌!

indian flags
indian flags

దావోస్‌: సమ్మిళిత అభివృద్ధిసూచీలో భారత్‌ చైనాకంటే వెనుకబాటులో ఉంది. వర్ధమాన దేశాల్లో భారత్‌కు 62వ స్థానం లభించింది.ప్రపంచ ఆర్ధికవేదిక విడుదలచేసిన సమ్మిళిత అభివృద్ధిసూచీలో చైనాకు 26వ స్థానం లభిస్తే పాకిస్తాన్‌కు 47వ స్థానం లభించింది. ఇక నార్వే ప్రపంచంలోనేఉన్నతమైన ఆర్ధికవ్యవస్థ ఉన్న దేశంగా నిలిచింది. ఇక లిథుయేనియా మరోసారి ఈ జాబితాలో టాప్‌స్థాయిలో నిలిచింది. వార్షిక సూచీని విడుదలచేసిన ప్రపంచ ఆర్ధికవేదిక దేశాలవారీగా ర్యాంకులను ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వేదిక వార్షిక సదస్సు మూడురోజులపాటు జరుగుతోంది.ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌లు సైతం సదస్సుకు హాజరవుతున్నారు.జీవనప్రమాణాలు, పర్యావరణ సుస్థిరత, రుణభారం నుంచి భావితరాలకు రక్షణ అన్న అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ ఆర్ధికవేదిక మదింపుచేసింది. అభివృద్ధిలో సమ్మిళిత అంటే అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలని కోరింది. ఆర్ధికవృద్ధి లక్ష్యాల్లో స్థూల దేశీయోత్పత్తిని మరింతగా వృద్ధిచేసే లక్ష్యంతో ముందుకువెళ్లాలని, స్వల్పకాలిక అసమానతలను తొలగించి సమ్మిళిత అభివృద్ధిని సాధించాలని కోరింది. గత ఏడాది మొత్తం 79 అభివృద్ధిచెందుతున్న దేశాల్లో భారత్‌ 60వ స్థానంలో నిలిచింది. 2018 సూచీప్రకారంచూస్తే మొత్తం 103 దేశాల్లో ఆర్ధికవృద్ధి, తరాల సమానత్వం వంటి వాటిని రెండు విబాగాలుగా విభజించింది. మొదటి భాగంలో 27 అగ్రరాజ్యాలను కేటాయిస్తే రెండో భాగంలో 74 అభివృద్ధిచెందుతున్న వర్ధమాన దేశాలను కేటాయించింది.ఈదేశాలను మరో ఐదు ఉపకేటగిరీలుగా విభజించింది.ఐదేళ్ల ధోరణులను ప్రామాణికంగాతీసుకుని అభివృద్ధిస్కోరును నిర్ణయించింది. తగ్గుముఖం, క్షీణత, మందగమనం, స్థిరత్వం, క్రమేపీ వృద్ధినిసాధించడం వంటి కేటగిరీలుగా విభజించింది. పది వర్ధమాన దేశాలతోపోలిస్తే భారత్‌కూడా అభివృద్ధిలోముందుకుసాగుతున్న దేశంగా నిలిచింది. కేవలం రెండు అగ్రరాజ్యాలుమాత్రమే అభివృద్ధిచెందిన ధోరణులతో ఉన్నాయి. నార్వే, ఐర్లాండ్‌, లగ్జెంబర్గ్‌, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌ టాప్‌ ఐదు అభివృద్ధిచెందిన దేశాలుగా నిలిచాయి. చిన్న యూరోపియన్‌ దేశాలు సూచీలో టాప్‌స్థాయిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా తొమ్మిదవ ర్యాంకు, నాన్‌యూరోపియన్‌ఆర్ధికవ్యవస్థలు ఈసారి టాప్‌ పదిజాబితాలో నిలిచాయి. ఇక జి7 దేశాల్లో జర్మనీ 12వ ర్యాంకులోనిలిచింది. తర్వాత కెనడా 17వ ర్యాంకు,ఫ్రాన్స్‌ 18వ ర్యాంకు,యుకె 21వ ర్యాంకు,అమెరికా 23వ ర్యాంకు, జపాన్‌ 24వ ర్యాంకు, ఇటలీ 27వ ర్యాంకులోనిలిచాయి. ఇక వర్ధమాన దేశాల్లో టాప్‌ స్థాయిలో ఉన్నవాటిలో లిథుయేనియా,హంగరీ, అజర్‌బైజాన్‌, లాత్వియా, పోలండ్‌లు నిలిచాయి. బ్రిక్స్‌ దేశాల్లో చూస్తే రష్‌యన్‌ ఫెడరేషన్‌ 9వ స్థానంలో ఉంది. తర్వాత చైనా 26వ తస్థానం,బ్రెజిల్‌ 37, భారత్‌ 62, దక్షిణాఫ్రికా 69వ స్థానంలో నిలిచింది. సూచీలో ప్రధానంగా మూడు అంశాలే ప్రామాణికంగా కనిపించిన వాటిలోభారత్‌ 72వ స్థానంలో సమ్మిళితస్థాయిలోనిలిచింది. అభివృద్ధిలో 66వ స్థానం, లింగవివక్ష, సమానత్వసూచీలో 44వస్థానంలో ఉంది. ఇక పొరుగుదేశాలు శ్రీనంక 40, బంగ్లాదేశ్‌ 34వర్యాంకు, నేపాల్‌ 22వ ర్యాంకులో నిలిచాయి. భారత్‌కంటేమెరుగైన ర్యాంకులు సాధించిన వాటిలో మాలి, ఉగాండా, రువాండా,బురుండి, ఘనా, ఉక్రెయిన్‌,సెర్బియా, ఫిలిప్పైన్స్‌, ఇండోనేసియా, ఇరాన్‌, మెసిడోనియా,మెక్సికో, థాయిలాండ్‌,మలేసియా దేశాలునిలిచాయి. తలసరి జిడిపిపరంగా వర్ధమాన దేశాల్లోచైనా మొదటిర్యాంకును సాధించింది. 6.8శాతంతో ఉంది. కార్మిక ఉత్పత్తి వృద్ధి 6.7శాతంగా నిలిచింది. సమ్మిళితరంగంలో మాత్రం వృద్ధి మందగమనంతో ఉంది. సామాజిక సమానత్వంతో ఆర్ధికవృద్ధిని ప్రాధాన్యతాక్రమంలో వృదిధచేసేలక్ష్యంగా చైనా అభివృద్ధిచేసింది.ఆర్ధికవేత్తలపైనా, విధాన నిర్ణేతలపైనా జిడిపి పరంగా ఎక్కువ ఆధారపడటం కూడా మంచిదికాదని అభిప్రాయపడింది. వస్తుసేవలపరంగా జిడిపి వృద్ధికి మరింత దోహదంచేస్తుందని వెల్లడించింది. సంపన్న,పేదదేశాలు కూడా భావితరం పరిరక్షణకు సతమతం అవుతున్నాయి. రాజకీయ, వ్యాపార రంగాల నేతలు ఆసియా వ్యాప్తంగా మరింత వృద్ధిని సాధించాలని, సామాజిక అసమానతలను నిర్మూలించాలని, యువభావితరానికి రాజకీయాలకు అతీతంగా వారినిప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇటీవలికాలంలోనే యువతరం అనేక దేశాల్లో రాజకీయాలను వణికించిన అంశాన్ని ప్రపంచవేదిక ఉటంకించింది.