సముద్ర యుద్ధం సన్నివేశాల చిత్రీకరణలో శాతకర్ణి

BALAKRISHNA
శాతకర్ణి కథ ఆధారంగా దర్శకుడు క్రిష్‌ నందమూరి బాలక్రిష్ణతో చేస్తున్న వందో చిత్రంలో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. మొరాకోలో జరిగిన మొదటి షెడ్యూల్‌లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే.ఇటీవల మొదలైన రెండవ షెడ్యూల్‌లో కూడా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో చిలుకూరి బాలాజీ గుడి దగ్గర వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఇంట్రవెల్‌ ముందు సమద్రంలో జరిగే ఈ సముద్ర యుద్ధ సన్నివేశాల కోసం దాదాపు వేయి మంది జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు 200 పడవలను వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయని సమాచారం. ఈ సన్నివేశాల్లో బాలకృష్ణతో పాటు కబీర్‌ బేడీ కూడా పాల్గొంటున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ నేతృత్వంలో ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ ఈ యుద్ధ సన్నివేశాలకు రూపకల్పన చేశారు. ఈ నెల 7 వతేదీ వరకూ ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.