సమతుల ఆహారంతో ఆరోగ్యం

Eating2
Eating

సమతుల ఆహారంతో ఆరోగ్యం

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం ముఖ్యమని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కాని ఆహారం పట్ల పూర్తి పరిజ్ఞానం లేకపోవడం వల్ల సరైన సమతులాహారాన్ని తీసుకోలేక పోతున్నారు. ఏ ఆహారపదార్థాలను తింటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందో తెలుసుకుందాం.

జొన్న, సజ్జ, రాగి లాంటి చవకైన తృణధాన్యాలను మార్చి మార్చి లేక కలిపి వాడవచ్చు.

మునగ, అవిశలాంటి చవకగా దొరికే ఆకుకూరలను రోజు మార్చి రోజు వాడడం ద్వారా ఎ-విటమిన్‌, ఇనుము, కాల్షియం లభిస్తాయి.

ధాన్యాలు, పప్పులు ఉదాIIజొన్నరొట్టెలు, ఆకుకూర పప్పుతో కలిపి వాడడం ద్వారా బలవర్థకమైన భోజనం అవ్ఞతుంది.

బొప్పాయి, మామిడి లాంటి ఆయా బుతువ్ఞలలో దొరికే పండ్లను తీసుకోవడం ద్వారా ఎ, సి విటమిన్లు లభిస్తాయి.

ధాన్యాలను మొలకెత్తించడం, పిండి పులియబెట్టడం, రాగిజావగా తయారుచేయుట ద్వారా పోషక విలువలను పెంచవచ్చు. ్య ఎండు చేపలు, ఎండు ద్రాక్ష మంచి పోషకాలను ఇస్తాయి.

కరివేపాకు, కొత్తిమీర లాంటివి పొడులుగా పచ్చళ్లుగా భద్రపరుచుకోవచ్చును. ్య ఆహారాన్ని వేయించుట కన్నా ఉడకబెట్టడం ద్వారా పోషక విలువలను కాపాడవచ్చు. ్య పదార్ధాలను నిల్వ ఉంచడం వలన, వాటిలోని పోషక విలువలు తగ్గుతాయి.

బియ్యాన్ని పాలిష్‌ పట్టడం, గట్టిగా పిసికి కడగటం, గంజి వార్చడం వలన దానిలోని పోషక విలువలు తగ్గుతాయి.

పదార్థాలను మూతపెట్టి వండటం వలన పోషక విలువలను రక్షించవచ్చు. కూరగాయలను కడిగిన తరువాత ముక్కలు చేయాలి. ముక్కలుగా తరిగాక కడుగకూడదు. ్య పండ్లను రసాలుగా తాగటం కంటే నేరుగా తినటమే మేలు.

చక్కెర బదులు వీలైనంత వరకు బెల్లం వాడాలి.

స్త్రీలు నెలసరి సమయంలో, గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానంతరం మంచి పౌష్టికాహారం తీసుకుని తగినన్ని నీళ్లు తాగాలి. పిల్లలకు నాలుగవ నెల నుండి మెల్లిగా పాలతో పాటు ఇతర ద్రవ, ఘన పదార్థాలను అలవాటుచేసి అన్ని రకాల కూరలు తినిపించాలి. ఈ విధమైన సమతుల ఆహారాన్ని రోజు తీసుకుంటూ, జీవితాన్ని ఆనందంగా గడపడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించు కొనవచ్చు. మరి ఈరోజు నుంచి ఆచరిస్తారు కదూ!