సమంతకు కేటీఆర్‌ ప్రశంస!

Samantha
Samantha

సమంతకు కేటీఆర్‌ ప్రశంస!

సినీ నటి సమంత, తెలంగాణలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో చేనేత కార్మికులు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పర్యటించారు కూడా. ఈ పర్యటనలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె తెలుసుకున్నారు. చేనేత కార్మికులతో ముచ్చటించి, మార్కెటింగ్‌ విషయంలో తనకు తోచిన సలహాల్నిచ్చారు సమంత. తనకు తెలిసిన ప్రముఖ డిజైనర్లను వెంటేసుకుని ఇటీవలే చేనేత కార్మికుల వద్దకు వెళ్ళిన సమంత, డిజైనర్‌ తరహా వYసాల్ని రూపొందించడంపై వారికి ఆయా డిజైనర్లతో సలహాలు ఇప్పించడమే కాకుండా, మార్కెటింగ్‌ విషయమై వారికి భరోసా ఇవ్వడంతో చేనేత కార్మికులూ సమంత పర్యటనలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇలా చేనేత కార్మికులతో మమేకం అవుతున్న తీరుకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయిపోయారు. సోషల్‌ మీడియాలో ఈ మేరకు సమంతని ఉద్దేశించి ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్‌ ప్రశంసలకు సమంత థాంక్స్‌ చెప్పారు. నటిగానే కాకుండా తనకు వీలున్నప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సమంతకు అలవాటు. ఆ సేవా కార్యక్రమాలతోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్న సమంత, ఇప్పుడిలా చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూకుడు ప్రదర్శిస్తుండడం అభినందించాల్సిన విషయం.