సభకు రావొద్దంటూ రూ.25 లక్షలు ఆఫర్‌!

ASADUDDIN OWISI
ASADUDDIN OWISI

హైదరాబాద్‌: ఎంఐఎం నేత , ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి నిర్మల్‌లో జరిగిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు రావొద్దంటూ, కాంగ్రెస్‌ అభ్యర్ధి మహేశ్వర్‌రెడ్డి తనకు రూ.25 లక్షల ఆఫర్‌ చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోన్‌కాల్‌ రికార్డు తన వద్ద భద్రంగా ఉన్నాయని, అవకాశం వచ్చినపుడు అన్నింటినీ బయటపెడతానని స్పష్టం చేశారు. తనను ఎవరూ కొనలేరని ,ముస్లింలను కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు ఓటు వేయాలి అని ఆయన ఈ సందర్బంగా ప్రజలకు పిలుపునిచ్చారు.