సబ్సిడీ సిలిండర్‌పై రూ. 6.52 తగ్గింపు

GAS CYLINDERS
GAS CYLINDERS

సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.133,

సబ్సిడీ సిలిండర్‌పై రూ. 6.52 తగ్గింపు

న్యూఢిల్లీ, : గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ధరలను సిలిండరుకు రూ.6.52లు తగ్గించారు. ఇంధన పరంగా మార్కెట్‌ధరలను అనుసరించి సవరించినట్లు ఆయిల్‌ మార్కె టింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. ఎల్‌పిజి సబ్సిడీ 14.2 కిలోల సిలిండర్‌ ఇపుడు 500.90కే వస్తుంది.

ప్రస్తుతం 507.42 రూపాయలకు ఢిల్లీలో విక్రయిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఈ ధరల తగ్గింపు సుమారు ఆరు నెలల తర్వాత అమలుచేసారు. జూన్‌నుంచి ఇప్పటివరకూ దరలు పెంచుతూనే ఉన్న కంపెనీలు ఒక్కసారిగా 14.13 రూపాయలు పెంచారు. ఎల్‌పిజి రేట్లు చివరిసారిగా నవంబరు ఒకటిన రూ.2.94లు పెంచారు. నాన్‌ సబ్సిడీ ఎల్‌పిజి మార్కెట్‌ధరలు రూ.133చొప్పున తగ్గించారు. అంతర్జాతీయంగా చమురు,గ్యాస్‌ధరల్లో వచ్చిన మార్పులపరంగా ప్రస్తుతం 14.2 కిలోల సిలిండరు ఢిల్లీలో 809.జ50గా విక్రయిస్తున్నారు.

ఎల్‌పిజి అందరు వినియోగదారులు మార్కెట్‌దరలకే కొనునగోలుచేయాల్సి ఉంది. ఏడాదికి 14.2 కిలోల సిలిండర్లు 12 దాటితే నాన్‌సబ్సిడీపైనే కొనుగోలుచేయాల్సి ఉంటుంది. వీరికిచ్చే సబ్సిడీ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ అవుతుంది. ప్రతినెలా ఈ సబ్సిడీ కూడా మారుతున్నది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ఎల్‌పిజి ధరలు, విదేశీ మారక విలువల ఆధారంగా ధరలునిర్ణయించడం వల్ల సబ్సిడీలు కూడా మారుతున్నాయి. అంతర్జాతీయ ధరలు పెరిగితే ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది. తక్కువకు వస్తే సబ్సిడీకూడా తగ్గుతుంది. పన్నుల నిబందనలప్రకారం ఎల్‌పిజిపై జిఎస్‌టి ఇంధన మార్కెట్‌ధరల ఆధారంగా విధిస్తారు. సబ్సిడీలు చెల్లిస్తున్నా పన్నులు మాత్రంమార్కెట్‌ధరల ఆధారంగానే చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌దరలు తగ్గితే పన్నుకూడా తగ్గుతుంది. పెరిగితే పన్నులు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా దేశీయ ఎల్‌పిజి గృహావసరాల సిలిండర్‌ 133 సిలిండర్‌ తగ్గితే ఒక్కొక్క ధర రూ.942.50నుంచి రూ.809.50కి తగ్గింది. ఇక సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు సబ్సిడీపరంగా రూ.308.60పైసలు పొందుతారు. డిసెంబరునెలకుగాను ఈ సబ్సిడీ మారుతుంది. నవంబరులో ఉన్న 433.66నుంచి డిసెంబరుకు సబ్సిడీని కూడా తగ్గించారు.