సబ్బుల ఎంపికలో జాగ్రత్త!

                                 సబ్బుల ఎంపికలో జాగ్రత్త!

SOAP
SOAP

రోజురోజుకీ పెరిగిపోతున్న రేట్లతో ఏ సబ్బును వాడాలో, ఏవిధంగా బడ్జెట్‌ తగ్గించుకోవాలనే ఆలోచనలతో సతమతమవ్ఞ తుంటారు. సబ్బులను ఖరీదు చేయడంలో నిర్ణయాలు చాలా తేలికగా తీసుకోవచ్చు. ఖరీదైనవా, నాణ్యమైనవా, చౌక ధరవా అని ఆలోచించి డబ్బును ఆదా చేయవచ్చు. అయితే సబ్బు కొనుగోలు చేసేటప్పుడు కంటికి కనిపించేవే కాకుండా మరికొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. సబ్బులో ఉన్న కొవ్ఞ్వ పదార్థాల శాతం ఆధారంగా టిఎఫ్‌ఎం లేదా టోటల్‌ ఫ్యాట్‌ నిర్ణయిస్తారు. సబ్బు నాణ్యతను నిర్ణయించడంలో టిఎఫ్‌ఎం ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ సబ్బు ఉపయోగించడం వల్ల పొడిబారడం లేదా చర్మవ్యాధులకు గురికావడం లాంటివి టిఎఫ్‌ఎం మీద ఆధారపడి ఉంటాయి. అధికమోతాదులో టిఎఫ్‌ఎం ఉన్న సబ్బులు మృదుత్వంతో ఉండి ఎక్కువ స్నానాలు చేయడానికి ఉపయోగించే వీలుంది. టిఎఫ్‌ఎం ఆధారంగానే భారత ప్రమాణాల నిర్ణాయక సంస్థ విశ్లేషణ మేరకు స్నానపు సబ్బులను గ్రేడ్లుగా విభజిస్తారు. సబ్బుల్లో ఉన్న కొవ్ఞ్వ పదార్థాల ఆధారంగా సబ్బులను గ్రేడ్‌1, గ్రేడ్‌2, గ్రేడ్‌3 రకాలుగా విభజించారు. ఈ వివరాలన్నింటిని సబ్బుల కంపెనీలు సబ్బుల ప్యాకింగ్‌పై ముద్రిస్తాయి.

ఈ వివరాలు వినియోగదారులు గమనించి మనం పెడుతున్న పెట్టుబడికి తగిన సబ్బును ఎంచుకుని ఖరీదు చేయాలి. సబ్బు తయారీలో 76శాతం టిఎఫ్‌ఎం ఉన్న వాటిని గ్రేడ్‌లో 70 నుండి 76శాతం టిఎఫ్‌ఎం ఉన్నా వాటిని గ్రేడ్‌ 60 నుండి 70శాతం టిఎఫ్‌ఎం ఉన్న వాటిని గ్రేడ్‌ 3గా పరిగణిస్తారు. కాగా టిఎఫ్‌ఎం 50 శాతానికి తక్కువగా ఉన్న సబ్బులకు ఎలాంటి గ్రేడ్‌లు కేటాయించలేదు. వీటిని స్నానపు సబ్బుల జాబితాగా పరిగణించకుండా, స్నానపు బార్‌ సబ్బులుగా పిలుస్తారు. సుద్దపొడి ఎక్కువగా ఉన్న స్నానపు బార్‌ వల్ల చర్మ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. స్నానపు సబ్బులా, స్నానపు బార్‌లా అనే విషయాన్ని ఎక్కడా ప్రకటించనందున వినియోగదారులకు వాటిమధ్య ఉన్న తేడా తెలియడం లేదు. ముందు తెలుసుకున్న ప్రకారం సబ్బుల టిఎఫ్‌ఎం శాతం ఎంత తక్కువ ఉందో అన్నిసార్లు సబ్బుతో స్నానాలు చేయవచ్చు.