సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ

హైదరాబాద్‌: ఐపిఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరుటి రన్నర్‌అప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 35 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది.. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన హైదరాబాద్‌ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్లు 19.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.