సత్య గ్యాంగ్‌ సినిమా ప్రారంభం!

KARAM DOSA
KARAM DOSA

డిసెంబర్‌లో రానున్న కారందొశ!

ఏదొ పెద్దగా చేసెయ్యాలి. ఇంకేదొ సాధించేయాలి.. అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతరం. మాటలు తగ్గించి చేతలు చూపించండి గురూ… ఒళ్లొంచి పనిచెయ్యండి. సెల్ఫ్‌కి, సమాజానికి పనికొస్తారని చెబుతున్నామన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్‌, చందన నాయకానాయికలుగా వీణావేదిక ప్రొడక్షన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌.జి తెరకెక్కించిన సినిమా కారందొశ. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా.. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చాలా సరదాగా సాగిపోయే అర్థవంతమయిన కథతో ఈ సినిమాని తెరకెక్కించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు. వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్‌ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు