సత్యం అప్పీల్‌కు శాట్‌ తిరస్కృతి

satyam
satyam

సత్యం అప్పీల్‌కు శాట్‌ తిరస్కృతి

తాజా ఉత్తర్వులు జారీకి సెబీకి ఆదేశం

ముంబై, మే 15: సత్యంకేసులో సెక్యూరిటీస్‌ అప్పి లేట్‌ ట్రిబ్యునల్‌ సంస్థ దాఖలుచేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ విధానాలకు ప్పాలడిందన్న అభియోగదాలపై సత్యంరామలింగ రాజుపై కేసులు దాఖలయ్యాయి. అయితే అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(శాట్‌) తిరిగి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని, జరిమానా లేదాశిక్ష ఎంతమొత్తం ఉండా లన్నది స్పష్టంగా ఉండాలని సెబీని ఆదేశించింది. సత్యంసంస్థలు 1849 కోట్ల రూపాయల నిధుల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే ఈ మొత్తం 12శాతం వడ్డీతో సహా జమచేయాలని ఆదేశించిం ది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినిబంధనలు ఉల్లం ఘించారని, అక్రమ వాణిజ్య విధానాలు అవలం భించడం వల్లనే ఈ నిధులపై సెబి ఉత్తర్వులుజారీ చేసిందని సంస్థ ఛైర్మన్‌ బి.రామలింగరాజు చేసిన అప్పీలుపై శాట్‌ తన అభిప్రాయం వెల్లడించింది.

ఒకదశలో సెబి ఉత్తర్వులను శాట్‌ పక్కనపెట్టింది. అలాగే సెక్యూరిటీస్‌ మార్కెట్లకు రాకుండా ఎంత కాలం ఉండాలన్నది సెబి నిర్ణయించాలని, అక్రమ లబ్ది ఎంతమొత్తం ఉందని, సెబి పూర్తికాలపు డైరెక్టర్‌ ఇందుకు సంబంధించి తాజా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. శాట్‌ వివరాలప్రకారం రామలింగరాజుకు షోకాజ్‌ నోటీసు జారీచేసినట్లు వెల్లడించింది. రామలింగరాజు, రామరాజుల ఆధ్వ ర్యంలో ఎంతమొత్తం ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ద్వారా అక్రమ లబ్దిపొందారని ఈ నోటీసులో ప్రశ్నించింది. అలాగే సంస్థలోని ప్రతి వ్యక్తికిఉన్న ప్రమేయం వారి లబ్దికూడా వివరించాలని సూచించింది. రెండుసెట్ల షోకాజ్‌ నోటీసుల్లో రామలింగరాజుబ్రదర్స్‌ను వివరణకోరింది.

అలాగేఅక్రమ లబ్ధి ఎవరు చేశారన్న అంశంపై సెబి స్పష్టంగా లేదని శాట్‌పేర్కొన్నది. ఆన్‌సేల్‌, సత్యం కంపెనీ బదిలీలకు సంబంధించి ఎవరు అక్రమలబ్ధి పొందారన్న అంశంపై కూడా సెబి స్పష్టత లేదని శాట్‌ అభిప్రాయపడింది. అందు వల్లనే సెబి తాజాఉత్తర్వులు జారీచేయాలని సూచిం చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగునెల ల్లోపు జారీచేయాలని కోరింది. ఐదేళ్లపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో సెబి రాజు, మరో నలుగురిని సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 14ఏళ్లపాటు బహిష్కరించింది.

2014లోనే ఈ ఉత్తర్వు లు జారీచేసింది. అలాగే అక్రమలబ్ధిసొమ్ము 12శాతం వడ్డీతో సహా జమచేయాలని ఆదేశించింది. 2009లో రాజు స్వయంగా తప్పిదాలు జరిగినట్లు రాసిన లేఖను శాట్‌ కూడా పరిశీలించింది. 200-2008 మధ్య కాలంలో అప్పిలేట్‌ వ్యక్తులు రికార్డులు తారుమారు చేయడం, నిధుల మళ్లింపులో అవకతవకలు, ట్రేడింగ్‌ అవకతవకలు వంటి వాటిలో కేవలం నిమిత్తమాత్రులేనని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో సెబి పూర్తి కాలపు సభ్యులు రామలింగరాజు, రామ రాజులు చట్టవ్యతిరేక వాణిజ్య విధానాలు అవలంభించి ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ నిబంధనలు ఉల్లం ఘించారన్నది నిర్ధారణకువచ్చి సమగ్ర పరిశీలన అనం తరంతాజాఉత్తర్వులుజారీచేయాలనిశాట్‌ ఆదేశించింది.