సత్తుపల్లిలో టిఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు

TUMMALA
TUMMALA

ఖమ్మం: సత్తుపల్లిలో టిఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని టిఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం సత్తుపల్లిలో కేటిఆర్‌, తుమ్మల, పొంగులేటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్యల మీడియాతో మాట్లాడుతూ..ఖమ్మం జిల్లాతో పాటు సత్తుపల్లికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. సత్తుపల్లి సీటు మన గౌరవ ప్రతిష్ఠలకు సంబంధించిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో సత్తుపల్లికి సాగునీరు అందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.