సత్తయ్య మరణం పట్ల తీవ్ర విచారం

KCR

చుక్కా సత్తయ్య మృతి తీరని లోటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణతో పాటు యావత్‌ దేశం గర్వించదగ్గ కళాకారుడిగా చుక్కా సత్తయ్య ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారన్నారు.