సచివాలయం పరిధిలో రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు

TS SECRETARIAT
TS SECRETARIAT

హైదరాబాద్‌: నగరంలోని తెలంగాణ, ఎపి సచివాలయాల పరిధుల్లో రెండు నెలల పాటు నిషేధాజ్ఞాలు విధిస్తూ పోలీసు కమిష నర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 23వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వచ్చే ఏడాది అంటే 2019 జన వరి 22వ తేదీ వరకు అమల్లో వుంటాయని ఆయన తెలిపారు. నిషేధాజ్ఞల సమయంలో సచివాలయాల ప్రాంగణంలో ఎవరు ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేయరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని, ఎలాంటి ఆయుధాలు, కర్రలు కానీ తేరాదని ఆయన తెలిపారు. సచివాలయాలకు సమీపంలోని మూడు కిలో మీటర్ల పరిధి వరకు ఈ ఆంక్షలు అమల్లో వుంటాయని కమిషనర్‌ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు.