సచివాలయం నిర్మాణానికి ఎపి సర్కార్ ఉత్తర్వులు
సచివాలయం నిర్మాణానికి ఎపి సర్కార్ ఉత్తర్వులు
ఇంటర్నెట్ డెస్క్: గుంటూరు: అమరావతి టౌన్షిప్లో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డిఎ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.160 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని సిఆర్డిఎను ఆదేశించింది. ఇందులో రూ.90 కోట్లు ప్రభుత్వ వడ్డీలేని రుణం, రూ.90 కోట్లు హడ్కో రుణంగా ప్రభుత్వం పేర్కొంది. జూన్ 30 లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.