సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌

SMITH
SMITH

సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్‌ తొలిటెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 21 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 21 టెస్టు సెంచరీలను సాధించడానికి స్మిత్‌కు 105 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, సచిన్‌ టెండూల్కర్‌ 110 ఇన్నింగ్స్‌లతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో నలుగురు మాత్రమే ఉండగా…

తాజాగా స్మిత్‌ కూడా చేరాడు. ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మెన్‌ 21 టెస్టు సెంచరీలను 56 మ్యాచ్‌ల్లో పూర్తి చేసి ఈ జాబి తాలో అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత భారత క్రికెట్‌దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ (98) ఉండగా… ఆ తర్వాత స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. యాషెస్‌ తొలి టెస్టులో స్మిత్‌ సెంచరీని నమోదు చేయ డంతో సచిన్‌ స్థానాన్ని ఆక్రమించాడు.

ఐదో స్థానంలో పాకిస్తాన్‌కు చెందిన యూసఫ్‌ యుహానా ఉన్నాడు. 21 టెస్టు సెంచరీలను తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సాధించిన వారిలో… బ్రాడ్‌ మెన్‌ (56), గవాస్కర్‌ (98), స్టీవ్‌ స్మిత్‌ (105), టెండూల్కర్‌ (110), యూసప్‌ యుహానా (120) ఉన్నారు. కాగా, తొలి టెస్టులో 261 బంతు లాడిన స్మిత్‌ తన టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీని సాధిం చాడు. సెంచరీ అనంతరం స్మిత్‌ తన హెల్మెట్‌ తీసి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపుచూస్తూ….ఛాతి పైభాగంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు లోగోపై బలంగా తాకుతూ తనదైన శైలిలో విజయగర్వం ప్రదర్శించాడు. దీంతో మైదానంలో ఉన్న అభిమానులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తిం చారు. స్మిత్‌ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 130.3 ఓవర్లకు గాను 328 పరుగులు చేసిన ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 141 పరుగులతో నాటౌట్‌గా నిలి చాడు. దీంతో గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాం డ్‌పై 26 పరుగుల ఆధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.