సచిన్‌కు మాత్రమే దక్కిన చోటు

nlg 7
Sachin

సచిన్‌కు మాత్రమే దక్కిన చోటు

మెల్‌బోర్న్‌: మాజీ పాకిస్తాన్‌ క్రికెటర్‌ యూనిస్‌ఖాన్‌ తన ఆల్‌టైం బెస్ట్‌ టెస్ట్‌ ఎలవెన్‌ జట్టును ప్రకటించాడు. ఈజట్టులో భారత్‌ నుంచి సచిన్‌ ఒక్కడికే చోటు కల్పించారు. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకున్న యూనిస్‌ వెస్టిండీస్‌ నుంచి ముగ్గుర్ని దక్షిణాఫ్రికా, భారత్‌,న్యూజిలాండ్‌ నుంచి ఒక్కొకరిని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. సచిన్‌తో పాటు పాక్‌కు చెందిన హనీఫ్‌ మహ్మద్‌ ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. జాక్వస్‌ కలిస్‌, బ్రియన్‌ లాలకు మూడు, నాలుగు స్థానాలను కేటాయించారు. జట్టు సారథి పగ్గాలను తన దేశానికి చెందిన హనీఫ్‌ మహ్మద్‌కు అప్పగించారు. జట్టు వివరాలు: మహమ్మద్‌ (పాకిస్తాన్‌), సచిన్‌ టెండూల్కర్‌(భారత్‌), జాక్వస్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా), బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌), వివియన్‌ రిచర్డ్స్‌(వెస్టిండీస్‌), గార్‌పీల్డ్‌ సోబెర్స్‌(వెస్టిండీస్‌), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్‌ ఖాన్‌(పాకిస్థాన్‌), రిచర్డ్‌ హ్యాడ్లీ(న్యూజిలాండ్‌, ముత్తయ్య మురళీధరన్‌(శ్రీలంక), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా)