సంబంధం లేకుండా రూ.2 లక్షలు ఇస్తాం: కవిత

K. Kavitha
K. Kavitha

జగిత్యాల ప్రభాతవార్త : వడ్డించేవాడు తమ వాడైతే ఎక్కడున్నా లడ్డూ తమదేనన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మహాకూటమి నాయకులు గుంపులుగా వస్తున్నారని, కేసీఆర్ సింహం లాంటి వారని, అందుకే సింగిల్‌గా వస్తున్నాడని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండలో రోడ్ షోలో ఎంపీ కవిత‌తో పాటు వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ బాబు, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మేడిపల్లి,కథలాపూర్ మండలాలకు నీళ్ళందించాలనే కోరిక కేసీఆర్‌కు ఉందని చెప్పారు. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా ఎస్సీలకు రూ. 2 లక్షల రుణాలు ఇస్తామని ఎంపీ కవిత తెలిపారు.