సంప్రదాయ ప్రతీకలు బోనాలు

Bonalu
Bonalu

సంప్రదాయ ప్రతీకలు బోనాలు

నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ప్రతీకగా ఆషాడమాసపు బోనాలు నిలుస్తున్నాయి. నవాబుల పరిపాలనకు పూర్వం కాకతీయులు పలు రూపాల్లో ఆదిపరాశక్తిని పూజించేవారు. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆషాడమాసంలో కాకతీదేవికి బలిపూజలు నిర్వహించేవాడని ప్రతీతి. ఉత్సవం చివరి రోజున అమ్మవారికి రాశులు రాశులుగా బోనం సమర్పించి ప్రజలందరికీ అన్నదానం చేసేవారు. ఆ ఉత్సవాన్ని కాకతీయులు సామ్రాజ్యంలో ప్రజలందరూ ఆషాడమాసంలో నిర్వహించేవారు.

==రాజు సామ్రాజ్యంలో ప్రజలందరూ ఆషాఢ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు దర్పణం బట్టే బోనాల పండుగ అనగానే గుర్తు వచ్చేది లాల్‌దర్వాజ సింహవాహిన శ్రీమహంకాళీ దేవాలయం, వందేళ్లకుపైగా ఘనచరిత్ర కలిగిన ఆలయంలో వెలసిన అమ్మవారు మహామహిమాన్వితగా భక్తులు విశ్వసిస్తారు.

ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించడానికి తెలంగాణ జిల్లాల నుండే కాకపొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల నుండి కూడా భక్తులు తరలివస్తారు. నిజాం ప్రభువ్ఞలు నగర రక్షణ కోసం పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు. నగరానికి రాకపోకలు సాగించడానికి వీలుగా పదమూడు దర్వాజాల వాటికి ఆనుకొని కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అలాంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్‌దర్వాజ ఒకటి. ఇక్కడి దర్వాజకు స్థానికులు పండుగలకు ఎర్రని జాజురంగుతో అలంకరణ వేయడంతో లాల్‌దర్వాజ అనే పేరు వచ్చింది. బోనాల పండుగ లాల్‌దర్వాజలోని శ్రీమహంకాళీ దేవాలయంతో పాటు హైదరాబాదులోని ఇతర ముఖ్యమైన దేవాలయాల్లో మీర ఆలం మండిలోని శ్రీమహంకాళి దేవాలయము ఒకటి. నిజాంకాలంలో హైదరాబాద్‌ నగర ప్రజలకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా మీరాలంమండి ప్రసిద్ధి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇతర జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు రైతులు తమ కూరగాయాలను ఎడ్లబండ్లపై మీరాలంమండికి తీసుకువచ్చేవారు.

ఇలా మీరాలంమండికి కూరగాయలు తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్లబండ్లను బండిఖానాలో నిలిపెవారు. వర్షాలు సకాలంలో కురిసి, పంటలు భారీగా పండాలని, వ్యాపారాలు సక్రమంగా జరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఇక్కడి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు. శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో మరో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయం. ఓంకార స్వరూపిణియైన జగన్మాత భక్తులనుద్దరించుటకు మైసమ్మ జగదాంబగా అనేక అవతారాలు దాల్చిన విషయం తెలిసిందే.

మన ఆంధ్రదేశంలో తెలంగాణలో ఆలంపూర్‌-బోగులాంబ క్షేత్రం, సికింద్రాబాద్‌-ఉజ్జయిని మహంకాళి దేవాలయం, బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రం, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌-పెద్దమ్మ క్షేత్రం ఉన్నాయి. అదే కోవకు చెందినదీ కార్వాన్‌-దర్బార్‌ మైసమ్మ క్షేత్రం. చారిత్మాత్మకమైన గోల్కొండ కోట దారిలో కొన్ని శతాబ్దాల క్రితం వెలసినది మైసమ్మ ఆలయం. రాజదర్బార్‌కు వెళ్లేమార్గంలో ఉన్నందున క్రమేణా ‘దర్బార్‌ మైసమ్మ అనే నామం ఏర్పడింది.

చార్మినార్‌ వద్ద గల భాగ్యలక్ష్మి:

అమ్మవారు సత్యనిష్ఠగల దేవతగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నీరాజనాలు అందుకుంటోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం గోల్కొండను పాలించిన నిజామ్‌ నవాబుల పాలనలో ప్రస్తుతమున్న చార్మినార్‌ పరిసర ప్రాంతాన్ని భాగ్యపతీపురం అని పిలిచేవారు. 70 సంవత్సరాల క్రితం మహంకాళి అమ్మవారు ఉప్పుగూడలో వెలిసింది. ఉప్పుగూడ నదీపరివాహన ప్రదేశంలో 7 చిన్నచిన్న ఆలయాలు గ్రామదేవతలుగా విలసిల్లె పూజలందుకొంటున్నాయి. మహంకాళి అమ్మవారికి అక్కాచెల్లెళ్లు అయిన ఎర్రపోచమ్మ, ఊరపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయములు నిర్మింపబడినవి. 1913 సంవత్సరంలో బేగంపేటలో శ్రీకట్టమైసమ్మ అమ్మవారు వెలసినది.

హైదరాబాదు పబ్లిక్‌స్కూలు నిర్మాణం జరుగుతున్నప్పుడు శ్రీ అమ్మవారు సదరు నిర్మాణం కాంట్రాక్టరుకి కలలో కనబడి ఇంత పెద్ద నిర్మాణం చేపట్టుచున్నారు. నేను ఈ గ్రామా నికి గ్రామదే వతగా నిలబడ్డాను. నాకు ఆలయం నిర్మిస్తే ఈ గ్రామాన్ని నేను కాపాడుకుంటాను అని కాంట్రాక్టరుకి కలలో చెప్పి శ్రీ అమ్మవారు అదృశ్యమైనారు. ఆ తరువాత యధాప్రకారం శ్రీ అమ్మవారు చెప్పినట్లుగా నిర్మాణం జరిగింది.

అప్పటి నుండి శ్రీ అమ్మవారు సదరు దేవాలయంలో స్థిరనివాసం ఏర్పరచుకొని బేగంపేట గ్రామ ప్రజలు శ్రీ అమ్మవారిని కలవరేటి మైసమ్మగా పిలిచేవారని ప్రతీతి. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ లో వెలసియున్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపురాతనమైన దేవాలయమని పూర్వీకుల అభిప్రాయం. వేలసంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయమున్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తోంది.

నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్‌ నగరానికి చుట్టూ ప్రహరీగోడ ఉండి, నగరం నుండి బయటకు వెళ్లుటకు 14 ద్వారములు ఉండేవి. వాటిలో చారిత్రాత్మకమైన గౌలిపుర ద్వారము ఒకటి. ఈ ద్వారం ముందు ఏనాడో వెలసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు, నాటి నుండి నేటి వరకు నిత్య, ధూప, దీప నైవేద్యా లు అందుకొనుచు, కొలిచే వారికి కొంగు బంగా రమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా, విరాజిల్లు తోంది. ఈ దేవాలయాల్లేగాక హైదరాబాద్‌లోని వందకు పైగా ప్రముఖ దేవాలయాల్లో బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తారు.

– వనిత విజయకుమార్‌ ద్వాప