సంతోషానికి అవధులు లేవు

AKKINENI SAMANTA
AKKINENI SAMANTA

సంతోషానికి అవధులు లేవు

చేసిన సినిమాతో ఏ మాయ జరిగిందో గానీ సమంత-చైతు ఫైనల్‌గా లవ్‌తో కనెక్ట్‌ అయ్యి పెళ్లితో సైటిలయ్యారు.. వారు పెళ్లికూడ టాలీవుడ్‌ చరిత్రలో అలా ఉండిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే పెళ్లి తర్వాత సమంత తన మ్యారేజ్‌ గురించి ఎక్కువగా మాట్లాడలేదు.. కానీ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు తన ఆలోచనలను అనుభవాలను చెప్పింది..
ప్రస్తుతం ఈప్రపంచం మొత్తంలో ఎక్కువ ఆనందంపడుతున్న అమ్మడు ఎవరంటే…నేను అని చెప్పేస్తా.. ఎందుకంటే ప్రస్తుతం నా సంతోషానికి అవధులు లేవు.. అక్కినేని వారి కోడలైనందుకు చాలా ఆనందపడుతున్నా.. నన్ను అర్ధం చేసుకునే భర్త దొరకటం కన్నా అదృష్టం ఏముంటుంది.. అంతేకాకుండా అందరూ నా ఇష్టాలను చాలా ఇష్టపడుతున్నారు..

అక్కినేని కోడలైన తర్వాత మార్పులు వస్తాయని నేను అనుకోను.. ఎందుకంటే వారు నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటున్నారు.. సాధారణంగా ఒక హీరోయిన్‌ మంచి సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న పుడు పెళ్లిచేసుకోవటం కరెక్టు కాదు.. అనే ఒక అపోహ ఉంది.. దాన్ని నేను బ్రేక్‌ చేయాలని అనుకుంటున్న ,,. పెళ్లి తర్వాత కూడ నాకునచ్చిన సినిమాలను మాత్రమే చేస్తా..అందులో ఎటువంటి మార్పు ఉండదు.. నా ఫ్యామిలీ (అక్కినేని) కూడ నాకు ఫుల్‌ సపోర్ట్‌తో ఉంది అని సమంత తెలిపింది..  పెళ్లి ప్లానింగ్‌ అంతా చైతుదే.. రెండుసార్లు పెళ్లిచేసుకుంటానని కలలో కూడ అనుకోలేదు.. ఏమాయ చేసావే లో కూడ మేము రెండుసార్లు పెళ్లి చేసుకున్నాం.. ఇపుడు అదే నిజమైంది.. బహుశా.. దేవుడు కనెక్ట్‌ చేసి ఉంటాడని చెప్పుకొచ్చింది.. ఇక హనీమూన గురించి ఏమీ అనుకోలేదని చెబుతూ,, ప్రస్తుతం సావిత్రి సినిమా షూటింగ్‌ ఫినిష్‌ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపింది.