సంతృప్తి లేని జీవితం నరకమే..!

CRYING
CRYING

సంతృప్తి లేని జీవితం నరకమే..!

వెయ్యి ప్లాస్టిక్‌ సర్జరీలు చేస్తే మాత్రం లేని అందం పుట్టుకొస్తుందా? తల్లక్రిందులుగా నూరేళ్లు తపస్సు చేసినా లేని కలిమి కట్టలు తెంచుకుని గుట్టలు గుట్టలుగా మన నట్టింట కుప్పలు తెప్పలుగా పడుతుందా? ఒక్క క్షణం ఆలోచించండి. ఈరెండూ అసాధ్యాలే. ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా ..లేని దానిగురించే ఆలోచిస్తూ ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేసే వారి బతుకంతా నరకమే. అసూయా ద్వేషాలతో వారికుంది, నాకు లేదంటూ మనోవేదన చెందేవారి జీవితమంతా వ్యధాభరితమే. ఈ రెండు లక్షణాలను విడనాడకుంటే బతుకంతా భారమే. ప్రతి నిమిషం ఆవేదనా భరితమే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నరీతిగా..ఎంత మొక్కకు ఎంత నీరు అవసరమో ఆ సృష్టికర్తకు తెలుసు. ఆయన మనకిచ్చిన దాంతో సంతృప్తి పడుతూ ఉన్నంతలో, ఉన్నదాన్ని హేపీగా జీవితాన్ని పరిపూర్ణ సంతృప్తితో గడపటం నిజంగా ఓ అదృష్టం అనే చెప్పాలి.

అలా గడపగలిగిన నాడు జీవితంలో లేమి అన్నది కన్పించదు. కొరతగా అనిపించదు. అంతా ఆనందమే. ప్రతిక్షణం ప్రమోదమే. ఈ సంతృప్తి లేకుంటే జీవితం ప్రతిక్షణం ..నరకమే క్షణంక్షణం విషాదమే.ఈ అసంతృప్తి మీలో మనోవేదనను రగిలిస్తుంది.ఆమనోవేదన మీ మనసును ఓ పక్క దహిస్తూనే మీ ఆరోగ్యాన్ని క్రమక్రమంగా దహించి వేస్తుంది.ఈ శరీరంలో దుర్భలం అవ్ఞతుంది.ఫలితం పలురకాల అనారోగ్యాలు. ఈ అనారోగ్యాలన్నింటికీ కారణం మనోవేదన. ఆ మనోవేదనకు కారణం అసంతృప్తి కనుక అసంతృప్తి మీ జీవితాన్ని నరకంగా మారుస్తుందని గ్రహించండి. దాన్ని ఎంత దూరంగా తరిమివేయగల్గితే అంతసుఖం, అంత ఆనందం, అంతమోదం.

కళ్ళముందున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ టి.వి ని చూస్తూ భగవంతుడు నాకిదన్నా ఇచ్చాడు..ఇది లేని నిర్భాగ్యలు ఎంతమంది లేరు అని ఆలోచించాలి తప్ప..కలర్‌ టి.వి.లేదే హోమ్‌ థియేటర్‌ లేదే అని ఆలోచించారంటే..ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌ టి.వి.ని కూడా మీరు ఎంజా§్‌ు చేయలేరు. అసలు ఏమిటి మీరు ఆశించేది?..కోట్లు గడించాలని, కీర్తి, ప్రతిష్ఠలు కావాలని.. అంతేనా. ఇంతేగా? సరే..ఈ రెండింటి ద్వారా మీకు లభించేదేమిటి? ఆనందం అవ్ఞనా? ఈ రెండూ ఉన్నవారు ఆనందంగా ఉండగల్గుతున్నారని మీరు భావి స్తున్నారా?

డబ్బుతోనే పలు కష్టాలు, నష్టాలు, వేదనలు, ఆవేదనలు, అనర్ధాలు, కట్టకట్టుకువస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభించటం చాలా సులభమే కానీ..వాటిని నిలబెట్టుకునేందుకు పడే కష్టాలు వర్ణనాతీతం. ధనం పోగుకావటం తేలికే. దాన్ని కరిగిపోకుండా చూసుకోవటానికి, అది దోచుకోబడకుండా దాచుకోవటానికి, దాన్ని అతిభద్రంగా కాపాడుకోవటానికి మనం పడే కష్టాలు కొల్లలు కోకొల్లలు. అప్ఞ్పడనిపిస్తుంది ఈ ముదరష్టప్ఞ డబ్బు లేని రోజే హేపీగా కలో గంజో తాగి జాలీగా నిద్రించాం అని. ధనం, కీర్తి..ఈరెండూ లేకున్నా కేవలం సంతృప్తి ఉంటతే ఉల్లాసం మిమ్మల్ని వీడని నీడగా మీవెన్నంటి ఉంటుంది.

గంజి తాగే నిరుపేద.. హమ్యయ్య నాకీపూటకీ గంజి దొరికింది చాలు అని సంతృప్తి ఉండగల్గుతున్నాడు. రోజు కూలీ చేతికందుకున్న కూలివాడు.. హమ్మయ్య ఈ రోజు గడిచిపోతుంది. రేపటి సంగతి రేప్ఞ చూసుకుందాం అంటూ హయిగా ఉండగల్లుతున్నాడు. సాయంత్రం వంద సంపాదిస్తే చాలు వెంటనే పనిమానేసి తక్షణం హయిగా ఇంటికెళ్ళి పెళ్ళాం బిడ్డలతో సినిమాకి వెళ్దాం అన్న సంతృప్తితో జీవితాన్ని కులాసాగా గడిపేవారెందరో ఉన్నారు. ఆ సంతృప్తే వారిలో లేకపోతే నిత్యం బ్రతుకు బాధామయమే. బ్రతుకు భారంగా, ఘోరంగా, దౌర్భాగ్యంగా అన్పిస్తుంది. ఛీ..! ఎందుకీ పాడు బతుకు అన్న నిరాశ వారిలో చోటు చేసుకుంటుంది. ఆ నిరాశ ఎన్నో అనారోగ్యాలకు అనర్ధాలకు దారితీస్తుంది. ఈబాధల నుండి బయటపడాలని వారు దుర్వ్యసనాలకు బానిసలవ్ఞతారు..ఫలితం మీరే ఆలోచించండి.

మనిషి సంతృప్తి డబ్బుకూడా పెట్టినప్ఞడు కాదు వచ్చేది అపార కీర్తి గడించినంత మాత్రాన మనిషికి అపార సంతృప్తి లభిస్తుందనటం కూడా పొరపాటే. మీ జేబులో ఉన్న పదిరూపాయల్లో ఒక రూపాయి ఓ పేదవానికి దానం చేసినప్ఞడో, మీకున్న దానిలో ఎంతో కొంత మీసాటివారికి, ఆర్తులకు, బాధితులకు సాయమందించి వారి ఆకలి, ఆర్తి తీర్చినప్ఞడో మీకు లభించే తృప్తే నిజమైన సంతృప్తి. ఆ తృప్తిద్వారా లభించే ఆనందం అలౌకికం, అనిర్వచనీయం, అద్వితీయం, మహత్తరం. కనుక ఉన్నదానితో సంతోషంగా జీవించటం అన్న కళను ప్రతి మనిషీ అధ్యయనం చేయాలి. ఔపోసనపట్టాలి.

ఉన్నంతలో సాటివారికి సాయం చేసి తద్వారా లభించే పరమానందంతో జీవితాన్ని సంతృప్తిమయం ,సంతోషమయం చేసుకోవాలి.బ్రతుకును నవ్ఞ్వల నందనవనంగా మార్చుకోవాలి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తివంచారా? సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? అన్న రీతిలో ఆలోచించండి. అంతే తప్ప..ఫలితాన్ని గురించి ముందుగానే అలోచించకండి. మీ ధర్మం మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితం ఏదైనా మీ మనసు వ్యధా భరితంకాదు.