సంజీవయ్యను విస్మరించడం తగునా!

శతజయంతి సందర్భంగా…

స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర వినీలాకాశంలో అణగారిన వర్గం నుంచి ఉద్భవించిన ‘అరుంధతీ నక్షత్రంలాంటి మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య క్రియాశీలక రాజకీయాల్లో పలు సంవత్సరాలు వెలుగొందారు. దామోదరం సంజీవయ్య నిరాడంబరుడు, స్నేహశీలి, దేశభక్తుడు, బహుజనుల పక్షపాతి, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కృషీవలుడు, నేరచరిత లేనివాడు, నిజాయితీకి మారుపేరు, పట్టుదల, కార్యదీక్ష కలవాడు. విద్యా వంతుడు, కవి, రచయిత, మధుర గాయకుడు, మంచి వక్త. ఈ మేలి కలయికల ప్రతిరూపమే సంజీవయ్య. ఈ గుణగణాల వల్ల దామోదరం సంజీవయ్య గొప్ప జాతీయ నాయకుడిగా ప్రముఖ దేశ నాయకుల చేత మన్ననలు పొందారు. సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో మునెయ్య, సుంకలమ్మ పుణ్యదంపతులకు కడపటి (ఐదవ) సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు సంగీతం, కళా త్మక సాంప్రదాయ కుటుంబ నేపథ్యం కలిగి ఉండటం వలన ఆయన నావి జీవితంలో సాహితీ, కళారంగాలపట్ల ఆసక్తి కలగ డానికి ప్రేరణ కలిగిందాయనకు. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సమాజంలో తాను ఉన్నతస్థితికి ఎదగాలనే పట్టు దలఉంటే ఏదైనా సాధ్యపడుతుందని నిరూపించారు.సంజీవయ్య ప్రాథమిక విద్యాభ్యాసం ఒక చోట కుదురుగా సాగలేదు. తన మేనమామగారి పాలకుర్తి గ్రామం, పెదపాడు గ్రామం, కర్నూలు లో జరిగింది. సెంకడరీ విద్యాభ్యాసం కర్నూలు మునిసిపల్‌ హై స్కూల్‌లో పూర్తి చేశారు. 1938-1942 వరకు ఉన్నత విద్యను అనంతపురం ఆర్ట్స్‌కళాశాలలో పూర్తి చేశారు. విద్యలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఎక్కిన ప్రతిమెట్టు దగ్గర పేదరికంపై గెలి చాడు. అది ఆయనలోని నిబద్ధతకు, దృఢసంకల్పానికి, పట్టుద లకు, గెలుపు, విశ్వాసానికి నిలువ్ఞటద్దం. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవించిన కాలంలో సంజీవయ్య ఉండటం ఆయనలో ఒకస్ఫూర్తిని నింపిందని అనుకోవచ్చు. 1950 జనవరి 26న రాజ్యాంగ చట్టసభల్లో డాక్టర్‌ అంబేద్కర్‌ స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన తరువాత తాత్కాలిక పార్లమెంటుగా రాజ్యాంగ నిర్మాణ సభ కొనసాగింది. ఆ తరుణంలో రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ సభలలో ద్విసభ్య విధానం రద్దు కొనసాగింది.

ఆ సమయంలో షెడ్యూల్‌ కులాల అభ్యర్థిగా సర్దార్‌ ఎస్‌. నాగప్ప తాత్కాలిక రాజ్యాంగ సభకు రాజీనామా చేయవలసి వచ్చింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే 1950లో ప్రొవెన్షియల్‌ పార్లమెంటు మెంబర్‌గా ఎన్నికయ్యే నాటికి సంజీవయ్య వయసు 29 సంవత్సరాలు మాత్రమే. సంజీవయ్య రాజకీయ అరంగేట్రం చేయడానికి కొంత మేర సర్దార్‌ నాగప్ప కూడా ముఖ్యకారకులు. 1952లో ఉమ్మడి మద్రాసు అసెంబ్లీకి కర్నూలు రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో శ్రీచక్రవర్తుల రాజ గోపాలచారి కేబినెట్‌లో గృహనిర్మాణం, సహకార సంస్థల శాఖల మంత్రిగాపనిచేశారు.1960లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారిగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రికావడం దేశం లోనే ఒక సంచలనం. సంజీవయ్య ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం(1960-1962) రెండేళ్లస్వల్పకాలం మాత్రమే.

ఉత్తరాంధ్ర ప్రజలకోసం శ్రీకాకుళంజిల్లాలో వంశధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వీరే.రాయలసీమలోని అలనాటి గాజులదిన్నె ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందివీరే.ఈ ప్రాజెక్టు నేడు సంజీవయ్య సాగర్‌గా పిలువబడుతుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన అగ్రకుల నాయకులు పార్టీగా పేరుపొందిన ఒక జాతీయ పార్టీకి దళిత నాయకుడు సంజీవయ్య 1962-1964, 1971-1972 సంవత్సరాలో ్లరెండు పర్యాయములు అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షు లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సంజీవయ్య రెండసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజకీయంగా అత్యున్నతమైన పార్టీ అధ్యక్ష పదవిని, రాజ్యాధికారంగా రాష్ట్రముఖ్యమంత్రి పదవిని దేశంలో అత్యున్నత పదవులైన కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవ్ఞలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయే కానీ ఏనాడూ ఆయన వాటి కోసం పాకులాడింది లేదు.

  • ఎస్‌.ఆర్‌.రావు వందవాసి
    (రచయిత:విశ్రాంత ఉద్యోగి,భారత ప్రభుత్వ అణుఇంధన సంస్థ)