సంఘం వల్ల ఎవరికి లాభం లేదు..ట్రంప్‌

వాషింగ్టన్‌: స్క్రీన్‌ యాక్టర్స్ గిల్డ్జ అమెరికా టీవీ, రేడియో కళాకారుల సమాఖ్య (ఎస్ఏజీజఏఎఫ్ టీఆర్ఏ)కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారు. అమెరికా చట్టసభ క్యాపిటల్ పై దాడికి ప్రేరేపించారన్న కారణంతో.. ఆయనపై వేటు వేయాలని ఆ సంఘం జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. సంఘం అధ్యక్షుడు గేబ్రియల్ కార్టరీస్ కు లేఖ రాశారు. తన హయాంలో కేబుల్ న్యూస్ కు ఎంతో సాయం చేశానని, కొన్ని వేల ఉద్యోగాలు కల్పించానని లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఎంఎస్ డీఎన్ సీ, ఖఫేక్ న్యూస్ సీఎన్ఎన్గ వంటి సంస్థల ద్వారా ఉపాధి కల్పించానన్నారు. సంఘంలో మీ వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఎన్నెన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు.

‘సంఘంలోని సభ్యులకు చేయలేదనకుండా ఏదో కొద్ది సాయం చేశారు. మీ వల్ల నాకైతే ఒరిగిందేమీ లేదు. అమెరికా వ్యతిరేక విధానాలను అమలు చేశారు. అందుకు మీ సంఘంలోని పేరున్న నటులు వేసిన వ్యాజ్యాలే నిదర్శనం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి సంఘంలో తాను ఇక ఉండలేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు తాను కూడా పలు సినిమాల్లో నటించి సినీ పరిశ్రమకు తనవంతు సాయం చేశానని అన్నారు. హోమ్ ఎలోన్ 2, జూలాండర్, వాల్ స్ట్రీట్ వంటి సినిమాలు, ద ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్, సాటర్ డే నైట్ లైవ్, ద అప్రెంటిస్ వంటి చెప్పుకోదగిన టీవీ సిరీస్ లలో నటించానని చెప్పారు. కాగా, 1989 నుంచీ డొనాల్డ్ ట్రంప్ ఆ సంఘంలో కొనసాగుతున్నారు.