సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలందరికీ చేరాలి: ఏపీ సీఎం

 

AP CM Photo
N Chandrababu Naidu

విజయవాడ: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. కార్య శిబిరం రెండో రోజు సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, పార్టీలకతీతంగా లబ్దిదారుల ఎంపికపై దృష్టి సారించాలని సూచించారు. నేతల వైఖరి విశ్లేషణకు 20 ప్రశ్నల లిస్ట్‌ను పార్టీ నేతలకు అందించారు. నేతలు బలం పెంచుకొని, బలహీనతలను సరిదిద్దుకోవాలని కోరారు. ఇప్పటి వరకు రియల్‌టైం గవర్నెన్స్‌ చేశానని, ఇకపై రియల్‌ టైం పాలిటిక్స్‌ చేస్తానని చంద్రబాబు అన్నారు.