సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట
2018-19 ఎపిబడ్జెట్ రూ.1,91,063 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,50,270 కోట్లు
మూలధన వ్యయం రూ.28,671 కోట్లు
ఆర్థికలోటు అంచనా రూ.24,205 కోట్లు
విభజన నిధులపై ప్రభుత్వం ఆశాభావం
తొలిసారిగా కులాల వారీ కేటాయింపుమిగులు చూపిన ఆర్థిక మంత్రి యనమల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 సంవత్సర రాష్ట్ర బడ్జెట్ను గురువారం ఉదయం గం.11.30కు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం భారీ అంచనాలతో లక్షా 91 వేల 63 కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. 2017-18 బడ్జెట్తో పోలిస్తే 2018-19 ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు 21.70 శాతం పెరిగాయి. ఇందులో వ్యవసాయ రంగానికి గతం కంటే 35.91శాతం, సాగునీటి రంగానికి 32.95 శాతం, విద్యారంగానికి 18.65 శాతం, క్రీడలు, యువజన సేవలకు 62.7 శాతం నిధులు అదనంగా ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల తన ప్రసంగంలో ‘ప్రజలే ముందు అనే తమ ప్రభుత్వ ప్రధాన నినాదంతో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు.
ఉజ్వలమైన సమసమాజాన్ని ఏర్పరగలిగే ఈ సంక్షేమాధారిత ప్రజా బడ్జెట్ మెరుగైన సామాజిక క్రమాన్ని నెలకొల్పాలన్న ప్రభుత్వ తపనను నెరవేరుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కుటుంబాల అభిప్రాయాలను పరగణించి, వివిధ వర్గాల ఆకాంక్షల మేరకు తగువిధమైన పథకాల ప్రమేయంతో చర్యలు తీసుకున్నామంటూ ప్రభుత్వ తాజా బడ్జెట్ లక్ష్యాలను వివరించారు. ‘ఎస్సీ,ఎస్టీ,బిసీ మైనార్టీల జీవనోపాధి వృద్ధితోపాటు కాపులు, బ్రాహణులు, వైశ్యులు, క్రిస్టియన్లు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం. చేనేత కార్మికులు, మత్స్యకారులు, యాదవులు, రజకులు, దూదేకులు, కళా కారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారి ఆర్థిక మెరుగుదల. నాయి బ్రాహ్మణ, వడ్డెర, భట్రాజు, సాగర, వాల్మీకి,బోయ, పూసల, మేతర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, శాలివాహన, కల్లుగీత తరగతులవారి జీవనా ధారానికి సహాయం. అట్టడునకు నెట్టబడ్డ నిరాదారణకు గురైన హిజ్రాల అభ్యన్నతి. వికలాంగుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపడం. మహిళలు, శిశువులకు మెరుగైన పోషక విలువలతోకూడి ఆహారం, స్వయం సేవక సంఘాల ఆర్థికాభివృద్ధి. ఆరోగ్యం నిమిత్తం ఖర్చు తక్కుయ్యే విధంగా కుదింపు. యువతకు ఆర్థికాభివృద్ిధతో కూడిన సాధికారత మరియు జీవనోపాధి వృద్ధి. రైతుల సంక్షేమానికి తోడ్పడే జలవనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థకం, మత్య పరిశ్రమ, ఉద్యానరంగాలు, పట్టు పరిశ్రమకు తోడ్పాటు.