సంక్రాంతి లక్ష్మీ స్వాగతం

PONGALAA
PONGAL

సంక్రాంతి లక్ష్మీ స్వాగతం

పర్వదినం దూ సంస్కృతికి సంబంధించిన గొప్ప పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అంటారు. జనవరి నెల నుండి డిసెంబరు నెల వరకు వచ్చే హిందూ పండుగలలో అతిపెద్ద పండుగ యిది.

కొన్ని చోట్ల నాలుగు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు పండుగలు జరుపుకుంటారు. స్వగ్రామం నుండి పొరుగâళ్లు వెళ్లేవాళ్లు కనుమ పండుగనాడు ప్రయాణం చేయరు. కారణం- కనుమనాడు కాకైనా కదలదు అనే నుడి వలన. ముక్కనుమ నాడో, తరువాత రోజో ప్రయాణం చేస్తారు. సంవత్సరం పొడుగున వచ్చే తెలుగు పండుగలు చాంద్రమానం ప్రకారం వస్తుంటే సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం వస్తుంది. సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం వలన దీనిని మకర సంక్రమణమని, మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతినాడు దక్షిణాయనం ముగింపు జరిగి ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. ఇది ఆరు నెలలుండే పుణ్యకాలం. ఈ కాలంలో చనిపోయినవారు స్వర్గానికి వెళతారని ఒక నమ్మకం.

దీనికి అనుగుణంగా శాస్త్రాలు కూడా ఆ విధంగా చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో దోఇణాయన కాలంలో నేలకొరిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై నుండి ఏకాదశి రోజు (అష్టమి దినమున) ప్రాణాలను విడిచిపెట్టాడు. తండ్రి శంతన మహారాజు భీష/్మనకు స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. అందువల్ల ఆయన ఏకాదశి రోజున ప్రాణాలను విడిచిపెట్టాడు. ఈ సంక్రాంతి పండుగ హేమంత రుతువులో పుష్యమాస ప్రారంభంలో వస్తుంది. పాడి పంటలతో ముడిపడిన పండుగ సంక్రాంతి. అన్నదాతలైన రైతులకు ఇది ప్రధానమైన పండుగ. పొలాల్లో కష్టపడి పంటలు పండించి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఆనందంతో రైతులు, ఇతరులు జరుపుకొనే పండుగ అవ్వడం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యం వచ్చింది. ఈనాడు ఈ పండుగ అంతర్జాతీయ స్థాయిలో జరుపుకొంటున్నారు. ఇది కుటుంబంలో ఉన్నవారినందరిని ఒక చోటుకు చేర్చేది, ఒక్కటిగా చేసేది. ఇది పెద్ద పండుగ అనే విశిష్టతను దక్కించుకున్నది. సంక్రాంతి అంటే వెలుగుతో కూడుకొన్న పండుగ. ఈ పండుగ ఆబాలగోపాలానికి, పాడి పశువులకు, వ్యవసాయానికి ఉపయోగించే జీవాలకు ఈ పండుగ ఆనందాన్ని చేకూరుస్తుంది. ప్రధానంగా ఇది గ్రామాలలో నున్నవారు అత్యంత ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటారు. భోగి పండుగ, తదితర పండుగలు చలికాలంలో వచ్చే పండుగలు కనుక భోగినాడు తెల్లవారుఝాముననే లేచి పెద్ద ఎత్తున మంటలు వేసుకుంటారు. పాత కర్ర సామానంతా ఈ మంటలలో వేస్తారు.

పాత సామానునంతా కాల్చడం, పాతను వదలి, కొత్తదానిని ఆహ్వానించడం అనీ, తాత్త్విక భావాలను ప్రోత్సహించడం అనీ చెబుతారు. కొందరు మంటల దగ్గర బిందెలు, కాగులు పెట్టి నీల్లు కాచుకొని ఆ నీళ్లతో ఉదయమే అభ్యంగన స్నానాలు చేస్తారు. పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు నూతన వస్త్రాలు ధరిస్తారు. స్త్రీలు ఇంటిముందు రంగు రంగుల ముగ్గులు, రంగవల్లులు పెడతారు. చిత్రవిచిత్రమైన ముగ్గులు పెడతారు. ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెలను పెడతారు. కన్నెపిల్లలు ఆ గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. ఆ తరువాత ఆడపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. గొబ్బెమ్మలతో బంతి, చామంతి, గుమ్మడి, బీర, పొట్ల మొదలైన పూలను, రేగుపండ్లను పెడతారు. తమ కోరికలు నెరవేర్చుమని గొబ్బెమ్మలను కోరుతారు. పిల్లలు కొత్త జీవితం ఇవ్వమని కోరడం వలన కన్నెపిల్లలకు మనసుకు నచ్చి వారితో వివాహం జరుగుతుందనే నమ్మకం తరతరాల నుండి వస్తున్నది. బాలురు భోగి పండుగ నాటి నుండి గాలి పటాలు(పతంగులు) ఎగురవేస్తుంటారు. కొన్ని చోట్ల పెద్దవారు కూడా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. గాలిపటం ఖరీదు 5 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. వాటి మీద దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల బొమ్మలు, స్పైడర్‌మెన్‌ ఫొటోలు ఉంటాయి.

బాలురు ఈ పతంగులను ఉత్సాహంతో వేడుకగా ఎగురవేస్తుంటారు. భోగి పండుగ రోజున స్త్రీలు బొమ్మల కొలువ్ఞలు ఏర్పాటు చేస్తారు. ముత్తైదువ్ఞలను బొమ్మల కొలువ్ఞలకు రావలసినదిగా ఆహ్వానిస్తారు. ఐదు సంవత్సరాల బాలబాలికలకు నానమ్మలు, అమ్మమ్మలు భోగిపండ్లు, చిల్లర నాణెములు, చెరకు ముక్కలు తలపైపోస్తారు. ఆ సందర్భంలో ముత్తైదువ్ఞలకు పసుపు, కుంకుమ, అరటిపండ్లు తాంబూలాలిచ్చి సాగనంపుతారు. ఇది భోగిపండగ నాడు చేసే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. భోగినాడు చేసే కారక్రమాలలో గోదాదేవి కల్యాణం ఒకటి. మార్గశిరమాసంలో ప్రారంభమయ్యే 30 రోజులు వ్రతం -పాశురాల పఠనం భోగి రోజున అంతమౌతుంది. ఈ రోజున గోదాదేవి రంగనాథుల వివాహం ఘనంగా జరుగుతుంది. నూతనంగా పెండ్లైన కుమార్తె, అల్లుడు ఈ సంక్రాంతి పండుగకు వస్తారు. వారు ఉభయులు నూతన వస్త్రాలు ధరించి ఆనందంతో ఉంటారు. వారు తినడానికి అమ్మాయి తల్లిదండ్రులు అరిసెలు, సకినాలు, నేతిగారెలు, కారప్పూసలు, నువ్ఞ్వలుండలు, సున్నండలు, కజ్జికాయలు, అమృతజిలేబీలు, పల్లీల ఉండలు మొదలైనవి తయారు చేస్తారు.

ఈ నాలుగురోజుల్లో గ్రామాలలో పెద్ద ఎత్తున కోడిపండాల ఆటలు జరుగుతాయి. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలలో పలు గ్రామాలలో జరుగుతాయి. వేలలో, లక్షలలో డబ్బు పందాలపై కాపులు కాస్తారు. భోగిరోజురాత్రి 7 గంటల సమయంలో అయ్యప్ప మకరజ్యతి దర్శనం భక్తులకు అన్ని ప్రాంతాల వారికి కలుగుతుంది. శబర్‌మలైలో ఉన్న భక్తులు ప్రత్యేకంగా అయ్యప్ప జ్యోతి దర్శనం చేయగలుగుతారు. పొంగలిని సూర్యదేవ్ఞనకు నివేదించడం భోగినాడు భక్తులు చేసే కార్యక్రమాలలో ఒకటి. కొత్తబెల్లం, కొత్తబియ్యం, పాలు, నెయ్యి కలిపి కొత్త కుండలో పొంగలిని తయారు చేస్తారు.
హరిలో రంగ హరీ అంటూ హరినామ కీర్తనలు పాడుతూ హరిదాసులు తలపై గుమ్మడికాయ ఆకారంలో కుదురుపై ఇత్తడి పాత్రపెట్టుకొని, గృహస్థలిచ్చే బియ్యం, డబ్బు, తీపిపదార్థాలు స్వీకరిస్తారు. బుడబుక్కలోళ్లు: తెల్లటి ధోవతి, చొక్కా ధారించి, దాని మీద నల్లటి కోటు వేసుకుని, ఎర్రని బొట్టుపెట్టుకొని ఇంటి యజమానుల భవిష్యత్తును పాటల రూపంలో చెబుతూ ఇంటింటి తిరుగుతారు. సంక్రాంతి రోజున ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధµరించి పితృదేవతలకు పూజలు చేస్తారు.

సంక్రాంతి రోజున పరమశివ్ఞని నెయ్యితో అభిషేకించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధాన్యం, పెరుగు, నువ్ఞ్వలు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున చాలా గ్రామాలలో రైతులు ఎద్దుల బళ్లలో ఊరేగుతారు. మూడవరోజు పండగ కనుమ. ఈ రోజు పాడిపశువ్ఞలను, దున్నే పశువ్ఞలను అలంకరిస్తారు. పసుపు, కుంకుమ పశువ్ఞల ముఖాలపై పూసి మెడలో గంటలతో నున్న పటకాలను కడతారు. పూజలు సలుపుతారు. పశువ్ఞలకు భక్ష్యములను తినిపిస్తారు. కొత్తధాన్యాలతో వంటలు చేస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు అన్నం, కూరలు, మాంసాహారం సమర్పిస్తారు.

-రాపాక ఏకాంబరాచార్యులు