సంక్రాంతి బరిలో మెగాస్టార్‌!

CHIRU
?Mega Star Chiranjeevi

సంక్రాంతి బరిలో మెగాస్టార్‌!

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖైదీ నంబర్‌ 150’ సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతోంది. ఈ చిత్రంలో అందాల కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. వి.వి.వినాయక్‌ ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన మెగాస్టార్‌ స్టిల్స్‌కి, మోషన్‌ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చినందుకు చిత్రయూనిట్‌ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. నిర్మాత రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. 70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్‌ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ చక్కని ఔట్‌పుట్‌ వచ్చిందన్న సంతృప్తి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు. రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్స్‌ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు తరుణ్‌ అరోరా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.