సంక్రాంతి కోసం ఆర్టీసీ 4,600 ప్రత్యేక బస్సులు

tsrtc busses copy
tsrtc busses

హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,600లకు పైగా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 9వ తేదీ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల సందడి మొదలుకానుందన్నారు. అదే రోజు నుంచే ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నగరం నలుమూలల నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి నడిపే ప్రత్యేక బస్సులతో ఇటు ప్రయాణికులకు అటు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు టీఎ్‌సఆర్టీసీ, ఏపీఎ్‌సఆర్టీసీ ఉన్నతాధికారులు పరస్పర సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సమన్వయ సమావేశంలో నిర్ణయించారు.