సంక్రాంతికి వస్తున్న ‘జై సింహా ‘

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సికె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ జైసింహా. బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి , హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రం శుక్రవారంతో రామోజీ ఫిల్మ్సిటీలోకీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిచేసుకుని టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేక సెట్లోబాలయ్య , అశుతోష్‌రాణా కాంబినేషన్లో 60 మంది ఫైటర్లతో రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో ఒక కృషియర్ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈచిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. ఈసందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు. బాలయ్య, నయనతార కాంబినేషన్లో వస్తున్న ఈచిత్రం విశేషంగా అలరిస్తుందన్నారు. విడుదలైన టైటిల్, బాలయ్య ఫస్ట్‌లుక్‌కి నందమూరి అభిమానుల నుంచే కాక తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.