సంక్రాంతికి రాజ్‌తరుణ్‌ ‘రాజుగాడు’

RAJ TARUN
RAJ TARUN

సంక్రాంతికి రాజ్‌తరుణ్‌ ‘రాజుగాడు’

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఇపుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎటివి సమర్ప్ణలో ఎకె ఎంటర్‌టైన్మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈరోరకం ఆడోరకం.. కిట్టుఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాలతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు.. ఇపుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌తరుణ్‌ చేస్తున్న చిత్రం రాజుగాడు.. సంజనారెడ్డి దర్శకురాలు.. రామబ్రహ్మం సుంకర నిర్మాత అమైరా దస్తుర్‌ హీరోయిన్‌గా నటించింది.. ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత రామబ్రహ్మం మాట్లాడుతూ , యంగ్‌హీరో రాజ్‌తరుణ్‌తో మా బేనర్‌లో హ్యాట్రిక్‌ హిట్స్‌ చిత్రాలోల నటించిన సంగతి విదితమే.. ఇపుడు ఆయనతో రాజుగాడు సినిమా చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. సినిమా చాలా బాగా వచ్చిందని, లేడీ డైరెక్టర్‌ సంజనారెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు.. కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న ఎంటర్‌టైనర్‌ ఇదన్నారు.. రాజ్‌తరుణ్‌ను సరికొత్త పాత్రలో చేస్తారన్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నామని తెలిపారు.