‘ స్టెరిలైట్‌ ‘ మూసివేత

STERILITE
STERILITE

తూత్తుకుడి: వేదాంతగ్రూప్‌ తమిళనాడులోని తూత్తుకుడిప్రాంతంలో ఏర్పాటుచేస్తున్న స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఉత్తర్వులుజారీచేసింది. ఈ ఫ్యాక్టరీని రద్దుచేయాలని కోరుతూ జరిపిన ఆందోళనల్లో 13 మంది చనిపోవడం, ఆపైభారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో తమిళనాడుప్రభుత్వం శాశ్వతంగా ఫ్యాక్టరీమూసివేయాలనినిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉత్తర్వును జారీచేసిందని అన్నారు. వాస్తవానికి వేదాంత ఈ ప్రాంతంలో రూ.2100 కోట్లతో రాగిని కరిగించే ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలనినిర్ణయించింది. 1996నుంచే కార్యకలాపాలుప్రారంబించింది. అయితేముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక ఉన్నతస్థాయి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, డిప్యూటి ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌సెల్వంసైతం హాజరయినట్లు వెల్లడించారు. అయితే అంతకుమించి ఈ ఉత్తర్వులపై వివరణ ఇవ్వలేదు. ఏఏ అంశాల ఆధారంగా ఈ ఫ్యాక్టరీనీ మూసివేయాలని నిర్ణయించింది కూడా తెలపలేదు. ప్రభుత్వం స్టెరిలైట్‌ యాజమాన్యానికి సానుకూలంగా ఉందని, ప్రతిపక్షాలు బారీ ఎత్తున విమర్శలుచేయడంతో ప్రభుత్వం పెరుగుతున్న ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారంనుంచి తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందునముందుగానే పరిస్థితిని బేరీజువేసిన పళనిస్వామి ప్రభుత్వం స్టెరిలైట్‌ను శాశ్వతంగా మూసివేయాలనినిర్ణయించింది. తొలిసారి ప్రారంభించిన ఫ్యాక్టరీకి ఎలాంటి నిరసనలు రానప్పటికీ తాజాగా రూ.2500 కోట్లతో చేపట్టిన విస్తరణపనులనుమాత్రం భారీ ఎత్తున నిరసన ప్రకటించారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి సిఒటిని రెన్యువల్‌చేసేందుకు నిరాకరించింది. దీనితో కొంతకాలం తాత్కాలికంగా ఉత్పత్తినిలిపివేసారు. మంగళవారంనుంచి జరుగుతున్న నిరసనల్లో టిఎన్‌పిసిబి ఫ్యాక్టరీకి విద్యుత్‌, మంచినీటిసరఫరానుసైతం నిలిపివేసింది.