షెల్టర్‌హోం మృతులు ఇద్దరు కాదు ఐదుగురు

shelter home
shelter home

సిబిఐ దర్యాప్తులో నిగ్గుతేలిన నిజాలు
పాట్నా: రాష్ట్రంలోని ముజఫరాపూర్‌ షెల్టర్‌హోం అత్యాచారాల కేసుల్లో చనిపోయింది ఇద్దరు కాదని, ఐదుగురు బాలికలని దర్యాప్తు అదికారులు నిగ్గుతేల్చారు. గతనెలలో షెల్టర్‌హోం ఉద్యోగి కృష్ణరామ్‌ సిబిఐ అధికారులకు ఇచ్చిన సమాచారంలో కొందరి మృతదేహాలను గోనెసంచుల్లో పడవేసి ఏడాది క్రితం బుధి గందక్‌ నదిలో పారవేసారని వివరించాడు. కృష్ణరామ్‌బ్రజేష్‌ఠాకూర్‌కు చెందిన ప్రెస్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఈ కేసులో కీలకనిందితుడు ఇతడేనని బ్రజేష్‌ఠాకూర్‌తోపాటు ఆతన్ని కూడా సిబిఐ విచారించింది. ఈ ఐదుగురు బాలికల మృతదేహాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. సిబిఐ అధికారులు ఇపుడు ఈ బాలికల శరీరాలను ఎవరికి అప్పగించాలన్న అంశంపై కీలకంగా శోధిస్తున్నారు. అలాగే ఆసుపత్రి అధికారులను కూడా సిబిఐ అధికారులు ఇంటరాగేషన్‌చేస్తారని అంచనా. మొత్తం 34 మంది బాలికలపై షెల్టర్‌హోంలో అత్యాచారాలు జరిగాయి.సిబిఐ శ్రీకృష్ణ వైద్యకళాశాల ఆసుపత్రిలో ఇందుకు సంబంధించిన దస్త్రాలను గుర్తించి స్వాధీనంచేసుకుంది. తాజాగా మృతిచెందిన బాలికలు ఇద్దరు కాదని, ఐదుగురని గుర్తించింది. వారి శకలాలను వెలికితీసిన సిబిఐ అధికారులు ఐదుగురు బాలికలకు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు సైతం గుర్తించారు. ఇద్దరు బాలికలకు 2013లోనే ఈ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వమించారు. మరో ఇద్దరికి 2015, మరొకరికి 2017లోను పోస్టుమార్టం నిర్వహించారు. సిబిఐ అధికారులు ఇపుడు ఈ బాలికల అవశేషాలను ఎవరికి అప్పగించాలన్న అంశంపైనే విచారిస్తున్నారు. అయితే ఈ బాలికల హత్య సంఘటనపై కేసులు నమోదయ్యాయా అన్న అంశంపై దర్యాప్తుజరుగుతోంది. గతనెల నాల్గవ తేదీ స్మశానవాటిక ప్రాంతంలో అంటే ఈ బాలికల అంత్యక్రియలు జరిగినట్లు చెపుతున్న ప్రాంతంలో మానవ ఎముకలను గుర్తించి స్వాధీనంచేసుకున్నారు. దీనితో అక్కడ తవ్వకాలుచేసారు. షెల్టర్‌హోం ఆవరణలోనే తవ్వకాలు చేపట్టారు. మరికొందరు బాలికలుసైతం చంపి ఇక్కడే ఖననంచేసి ఉంటారని సిబిఐ అధికారులు అనుమానించారు. కీలకనిందితుడు కృష్ణరామ్‌చెప్పినవిధంగాచూస్తే సిబిఐ అధికారులు గదక్‌ నదినుంచి ఎలాంటి వివరాలను సేకరించలేకపోయారు. సిబిఐ కథనం ప్రకారం రామ్‌ బ్రజేష్‌ కుమార్‌ తనను ఈ మృతదేహాలను పారవేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఠాకూర్‌కు చెందిన ఎన్‌జిఒ సేవా సంకల్ప్‌ ఎవమ్‌ వికాస్‌సమితికి చెందిన ఇద్దరు బాలికలు అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోయమారని, ఆఖర్‌ఘాట్‌బ్రిడ్జిపైనుంచి గుడ్డు అనే ఉద్యోగి సాయంతో వీరి మృతదేహాలను పారవేసినట్లువెల్లడించాడు. గుడ్డుతోపాటు విజ§్‌ు తివారి అనే ఠాకూర్‌డ్రైవర్‌ కూడా ఉన్నాడని వివరించారు. బ్రజేష్‌ ఠాకూర్‌స్వఛ్ఛంద సంస్థలో 42 మంది బాలికలు ఉంటున్నారు. 34 మందిపై లైంగికంగా వేధింపులు జరిగాయి. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌(టిస్‌) నిర్వహించిన ఆడిట్‌లో ఈ అంశం వెలుగుచూసి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.