షూటింగ్‌ పూర్తిచేసుకున్న మహానుభావుడు

MAHAANUBHAVUDU
MAHAANUBHAVUDU

షూటింగ్‌  పూర్తిచేసుకున్న  మహానుభావుడు

విజయదశమికి చిత్రం విడుదల

శర్వానంద్‌ హీరోగా, మెహరిన్‌ హీరోయిన్‌గా, మార్తుతి దర్శకత్వంలో యువిక్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానుభావుడు షూటింగ్‌ పూర్తిచేసకునింది.. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది..

ఇటలీ , ఆస్ట్రియా, క్రొయెషియా లాంటి విదేశాల్లో మరియు, పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటీలో అందమైన లొకేషన్స్‌లోషూటింగ్‌ జరుపుకుంది.. ఈ వారం నుంచి ఆడియో సింగిల్స్‌ విడుదల చేసి త్వరలోనే థియేట్రికల్‌ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, శర్వానంద్‌ హీరోగా మూడవ చిత్రం, మారుతి దర్శకుడిగా, రెండవ చిత్రంగా మా బ్యానర్‌లో షూటింగ్‌ పూర్తిచేసుకున్న చిత్రం మహానుభావుడు . మారుతి చెప్పిన కేరక్టరైజేషన్‌ దాని నుంచి వచ్చిన కామడీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని నమ్ముతున్నామన్నారు.. ఈ చిత్రం షూటింగ్‌ని విదేశాల్లో ఇండియాలోని పలు ప్రదేశాల్లో చిత్రాన్ని షూట్‌చేశామన్నారు.. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ రావటమే కాకుండా సుమారు కోటి వ్యూస్‌ డిజిటల్‌ మీడియాలో పొందిందన్నారు.. విజయదశమికి విడుదల చేయటానికి సన్నాహాలుచేస్తున్నామన్నారు..
మారుతి మాట్లాడుతూ, భలేభలే మగాడివో§్‌ు చిత్రం తర్వాత నాకు బాగా నచ్చిన కేరక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రం మహానుభావుడు అన్నారు. అన్ని పక్కాగా ఈ కథకి తగ్గట్టుగా కుదిరాయన్నారు. శర్వానంద్‌ కెరీర్‌లో ఈచిత్రం బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుందని నమ్మకం ఉందన్నారు.. త్వరలో రెండు మ్యూజిక్‌ సింగిల్స్‌ని తదుపరి ఆడియోను విడుదల చేస్తామన్నారు.
శర్వానంద్‌, మెహరీన్‌, వెన్నెల కిషోర్‌,నాజర్‌, భద్రం, కల్యాణి నటరాజ్‌ , పిజ్జాబా§్‌ు , భాను తదితరులు ప్రధాన తారాగణం