షావోమి 10 బిలియన్‌ డాలర్ల ఐపిఒ

XIAOMI
XIAOMI

ముంబయి: స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం షావోమి అతిపెద్ద ఐపిఒ జారీకి దరఖాస్తుచేసింది. హాంకాంగ్‌ ఎక్ఛేంజిలో ఐపిఒ దరఖాస్తులుచేసినట్లు వెల్లడించింది. 2014నుంచి సంస్థ ఐపిఒకు రావాలని చూస్తోంది. అయితే ఒకప్పుడు చైనా అతిపెద్ద ఇకామర్స్‌ దిగ్గజం ఆలిబాబా ఇకామర్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపిఒను జారీచేసి భారీ ఎత్తున నిధులు సమీకరించింది. ఇందుకు అనుగుణంగానే కంపెనీ ప్రస్తుతం తన ఐపిఒను మార్కెట్‌లోనే అతిపెద్ద ఐపిఒగా పేర్కొంటున్నది. ఈఐపిఒద్వారా కంపెనీ పది బిలియన్‌ డాలర్లు అంటే సుమారుగా 1000కోట్ల డాలర్ల నిధులు సమీకరించే పనిలో పడింది. అదే జరిగితే చైనా ఎక్ఛేంజిల్లో అత్యధిక నిధులు సమీకరించిన కంపెనీగా ఆలిబాబాను షావోమి అధిగమించే అవకాశం ఉంది. కంపెనీ మార్కెట్‌ విలువలుసైతం 100 బిలియన్‌ డాలర్లుగా చూపిస్తోంది. 2014లో ఆలిబాబా సమీకరించిన ఐపిఒ నిధులు 21.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. షావోమి ఐపిఒకు వస్తున్నట్లు తెలియగానే ఇన్వెస్టర్లకు కంపెనీ ఆర్ధికస్థితిగతులపై ఎక్కువ ఆసక్తి పెరిగింది. కంపెనీ రాబడులు 114.62 బిలియన్‌యువాన్‌లుగా ఉంది. అంటే 18 బిలియన్‌డాలర్లుగా ఉన్నట్లు 2017చివరినాటికి లెక్కలుచూపించింది. 2016 రాబడులకంటే 67.5శాంపెరిగింది. అంతేకాకుండా 2016 491.6 యువాన్‌ల లాభాలు వస్తే ఈ సారి 43.89 యువాన్‌ల నష్టం ఉన్నట్లు సైతం ప్రకటించింది. నిర్వహణ లాభం 2017లో 12.22 బిలియన్ల యువాన్‌లుగా ఉంది. గత ఏడాది 3.79 బిలియన్ల యువాన్‌లనుంచి భారీగా వృద్ధినమోదుచేసింది. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు షావోమి డజన్లకొద్దీ ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయి ఉన్న గృహోపకరణాలు, గాడ్జెట్లు, స్కూటర్లు, ఎయిర్‌ప్యూరిఫయర్లు, రైస్‌ కుక్కర్లు వంటివి ఉత్పత్తి మార్కెటింగ్‌ చేస్తోంది. ఎక్కువగా ఇంటర్నెట్‌ససేవలనుంచే అధిక రాబడులు, లాభాలు ఆర్జిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యంత చౌకధరలతో హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్న కంపెనీగా షావోమికి పేరుంది. దక్షిణకొరియా శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కో లిమిటెడ్‌, యాపిల్‌ ఇంక్‌ కంపెనీలకు గట్టిపోటీనిస్తోంది. షావోమి ఐపిఒ హాంకాంగ్‌లో మొట్టమొదటి ఐపిఒగా ఉంది. కొత్తగా ఇటీవలే నియమనిబంధనలు హాంకాంగ్‌ ఎక్ఛేంజి మార్చింది. మరింతగా టెక్‌ సంస్థల జాబితాకు వీలుకల్పిస్తూ భారీ ఎత్తున జాబితాచేసింది. హాంకాంగ్‌, న్యూయార్క్‌, చైనా మెయిన్‌ల్యాండ్‌లలో కంపెనీలను మరింత ప్రోత్సహించేందుకు నిబంధనలు మార్చారు. హాకాంగ్‌ ఎక్ఛేంజి లెక్కకుమించి టెక్‌కంపెనీల జాబితాను స్వాగతిస్తోంది. వచ్చే రెండేళ్లలోచైనాసంస్థలు మొత్తం మార్కెట్‌ విలువలు 500 బిలియన్‌ డాలర్లుగా ఉంటాయని అంచనా. సిఎల్‌ఎస్‌ఎ, మోర్గాన్‌ స్టేన్లీ, గోల్డ్‌మానశాక్స్‌గ్రూప్‌ ఇంక్‌ షావోమి ఐపిఒను పర్యవేక్షిస్తున్నాయి. అంతేకాకుండా షావోమి చైనా డిపాజిటరీ రీసిప్ట్‌లను కూడా జారీచేసేందుకు నిర్ణయించింది. ఐపిఒ తర్వాత షావోమి ఈ సెక్యూరిటీల జారీకి రంగంసిద్ధంచేస్తోంది. ఇందుకోసం అంటే ఇడిఆర్‌ ఇష్యూకోసం సైటిక్‌ సెక్యూరిటీస్‌ను నియమించుకుంది. చైనా స్టేట్‌ కౌన్సిల్‌ సిడిఆర్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చింది. అయితే ఎప్పుడు, ఎంతమొత్తం విడుదలవుతుందన్నది అస్పష్టంగా ఉంది. కంపెనీ సహవ్యవస్థాపకుడు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి లీజన్‌ మాట్లాడుతూ సిడిఆర్‌లు ఒకమంచి ఆలోచన అని ఒక గొప్ప విధానంతో వస్తున్న ఇష్యూ అని పేర్కొన్నారు. లీ ఆధ్వర్యంలో షావోమి అగ్రరాజ్యాల మార్కెట్లకుసైతం విస్తరిస్తోంది. ఇపుడిపుడే అమెరికా కారియర్లు షావోమివైపు వస్తున్నాయి. యాపిల్‌ ఇంక్‌కు గట్టిపోటీగా నిలుస్తోంది.