షావోమి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌

REDMI PHONES
REDMI PHONES

ముంబై: షావోమి రెడ్‌మి నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ చేసింది. సెప్టెంబరు 5 బుధవారం నిర్వహించిన స్పెషల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో భాగంగా రెడ్‌మి 6సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేసింది. రెడ్‌మి 6, రెడ్‌మి 6ప్రో, రెడ్‌మి 6ఏ వేరియేషన్లలో ఈ ఫోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో దొరుకుతున్నాయి. 5.45 అంగుళాల హైడెఫినిషన్‌ ప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ 12 ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ హీలియో పి22 సాక్‌, 32జిబి, 64జిబి స్టోరేజ్‌, 256 జిబి వరకు పెంచుకునే అవకాశముంది. 12+5 ఎంపి డ్యుయల్‌ రియల్‌కెమెరా, 5ఎంపి ముందు ఫేసింగ్‌ కెమెరా, 3,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఎఐ ఫేస్‌ అన్‌లాక్‌ దీనిలోఉన్నాయి. నలుగు, రోజ్‌గోల్డ్‌, గోల్డ్‌, బ్లూ రంగులలో ఈ ఫోన్లు ఉన్నాయి.