షావోమి, జియో ఫీచర్‌ఫోన్లు నంబర్‌వన్‌!

JIO, XIAOMI
JIO, XIAOMI

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్త షావోమి భారత్‌ స్మార్ట్‌ఫోన్‌మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 31.1శాతం మార్కెట్‌ వాటాతో ఉంది. అలాగే ఫీచర్‌ఫోన్‌ పరంగా రిలయన్స్‌జియో అన్ని ఫోన్‌ కంపెనీలను తలదన్ని మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌లో 35.8శాతం మార్కెట్‌ వాటాతో ఉంది. 2017 నాలుగోత్రైమాసికంలో షావోమి 25శాతం మార్కెట్‌ వాటా కొనసాగించింది. కౌంటర్‌పాయింట్‌సంస్థమార్కెట్‌మానిటర్‌ సర్వేప్రకారంచూస్తే శాంసంగ్‌ 26.2శాతం మార్కెట్‌ వాటాతో రెండోస్థానంలో ఉంది. చవివో 5.8శాం మార్కెట్‌ వాటాతో నిలిచింది. రిలయన్స్‌జియోఫోన్‌ మార్కెట్‌ స్తాయిభారీగాపెరగడంతో భారత్‌లో మొత్తం మొబైల్‌ఫోన్‌ ఎగుమతులుసైతం 48శాతంపెరిగినట్లు వెల్లడించింది. ఇక హువేయికంపెనీ హానర్‌ బ్రాండ్‌ టాప్‌ ఐదు బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. హానర్‌ 14శాతం, షావోమి 134శాతం, వన్‌ప్లస్‌ 112శాతం మార్కెట్లలో శరవేగంగా మార్కెట్‌ అవుతున్న బ్రాండ్లుగా నిలిచాయి. పండగసీజన్లపరంగా కొన్ని బ్రాండ్లు మరింతగా ముందుకువచ్చాయని పరిశోధక విశ్లేషకులు కర్ణ్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఈత్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు తక్కువగానే విడుదలయ్యాయి. షావోమి శాంసంగ్‌లు మాత్రమే కొత్త ఉత్పత్తులతో మార్కెట్‌పెంచుకోగలిగాయి. ఇక గతేడాది రెండోత్రైమాసికంనుంచి కొంత పికప్‌ అయ్యాయి. 2జి, 3జి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు తమ 4జి మొబైల్‌ఫోన్లకు మారుతున్నట్లు చౌహాన్‌ వెల్లడించారు. ఒకే త్రైమాసికంలో టాప్‌ ఐదు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు 70శాతం మార్కెట్‌తో ఉన్నట్లు తేలిందన్నారు. మొత్తం స్మార్ట్‌ఫోన్‌మార్కెట్లలో షావోమి,శాంసంగ్‌లు 58శాతం వాటాతో ఉన్నాయి. షావోమి రెడ్‌మినోట్‌, 5ప్రొ అత్యధిక బ్రాండ్లుగా అమ్ముడుతున్నాయి. ఇక శాంసంగ్‌ గెలాక్సీ జె7, నెక్స్ట్‌, జె2 వంటివి మంచి మార్కెట్‌ సాధించినట్లు పరిశోధక విశ్లేషకులు అన్షికజైన్‌ వెల్లడించారు. భారత్‌ మార్కెట్లలో చైనా ఫోన్‌ మార్కెట్‌ భారీగా ఉందని, గత ఏడాది 36శాతం ఉంటే ఈ ఏడాది మరింతగాపెరిగిందన్నారు.ప్రత్యేకించి తక్కువధరలకే డేటా ప్లాన్లు రావడమే ఇందుకుకీలకమని అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌పాథక్‌ వెల్లడించారు. చైనా కేంద్రంగా ఉన్న ట్రాన్సిషన్‌గ్రూప్‌ఐదో పెద్ద సంస్థగా నిలిచింది. మొత్తం టెక్నో,ఐటెల్‌, ఇన్ఫినిక్స్‌మూడు బ్రాండ్లతో నాలుగుశాతం వాటాతో ఉంది. ఇక ఐదో స్థానం కోసం లావా, మైక్రోమాక్స్‌, హానర్‌, నోకియా హెచ్‌ఎండి, లెనోవో, మోటో బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌లో ఐటెల్‌ మూడో అతిపెద్ద కంపెనీగా17శాతం వృద్ధితో ఉంది.