షరీఫ్‌కు మరో రెండు కేసులపై నోటీసులు

Nawaz Shareef
Nawaz Shareef

ఇస్లామాబాద్‌: పనామా గేట్‌ కేసు ఆరోపణలతో నవాజ్‌ షరీఫ్‌ పదవీవిచ్యుడైన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు అవినీతి కేసులు ఆయన్ను  మరిన్ని చిక్కుల్లో పడేసింది. నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో గతవారం షరీఫ్‌తో పాటు ఆయన కుమారుడు హుస్సేన్‌, కుమర్తె మరియం, అల్లుడు మహమ్మద్‌ సఫ్దార్‌, మాజీ ఆర్థికమంత్రి ఇషక్‌ దార్‌పై నాలుగు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన కుటుంబమంతా సెప్టెంబర్‌ 19తేదీలోగా తమ విచారణకు హాజరువావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. లోగడ పనామా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పున:సమీక్షించాలని  కోరుతూ షరీఫ్‌ కుమారుడు, కూతురు, అల్లుడు, మాజీ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్‌దార్‌ సుప్రీంకోర్టులో విడివిడిగా దాఖలు చేశారు. వీటిపై బుధవారం నుంఇ  సుప్రీంకోర్టు విచారణ ప్రారంబిస్తోంది. 1990 సంవత్సరంలో షరీఫ్‌ ప్రదానిగా ఉన్నప్పుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు అక్రమ నగదు  చెలామణికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు దాఖలయ్యాయి. వివిధ కంపెనీలను అడ్డుపెట్టుకుని షరీఫ్‌ లండన్‌లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పనామా పత్రాల ద్వారా బహిర్గతమైంది. దీనిపై విచారించిన సుప్రీకోర్టు షరీఫ్‌ను దోషిగా నిర్ధారించింది. పార్లమెంటులో నిజాయితీ గల సభ్యుడిగా కొనసాగేందుకు షరీఫ్‌కు అర్హత లేదని, ఆయన ప్రధానిగా కొనసాగేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈజాజ్‌ అఫ్జల్‌ ఖాన్‌ జూలై 28న తన తీర్పులో పేర్కొన్నారు.