షరీఫ్‌కు మరోదఫా చుక్కెదురు

Nawaz Shriff
Nawaz Shareef

ఇస్లామాబాద్‌: పనామా గేట్‌ పత్రాల కేసులో పదవి కోల్పోయిన పాక్‌ మాజీ ప్రధాని షరీఫ్‌కు మరోసారి చుక్కెదురైంది.
ప్రధాని పదవికి తనను అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నవాజ్‌ దాఖలు
చేసిన పున:సమీక్ష పిటిషన్‌ను ఆ దేశ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నవాజ్‌తో సహా పనామా పత్రాల
వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లు తోసిపుచ్చుతున్నట్లు
పాక్‌ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. నవాజ్‌షరీఫ్‌ లండన్‌లో అక్రమాస్తులు కలిగి ఉన్నారని పనామా పత్రాలు
వెల్లడించగా ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ ఏడాది జూలై 23న ఆ దేశ న్యాయస్థానం
తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం నవాజ్‌షరీఫ్‌, ఆయన కుమారుడు,
కుమార్తె, అల్లుడుపై కేసు నమోదు చేసింది. వారందరినీ దర్యాప్తు బృందం ఇప్పటికే పలుదఫాలుగా విచారించింది.