షరపోవా ట్వీట్స్ పై నెటిజన్స్ ఆగ్రహం
అసలెవరీ షరపోవా అంటూ ట్రోల్!

సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదంటూ టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా అన్న మాటలు పట్టుకుని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ట్వీట్ల మీద ట్వీట్లతో షరపోవాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. క్రికెట్లో మరెవరికీ సాధ్యం కాదన్న స్థాయిలో నెలకొల్పి క్రీడాలోకంలో ఆల్ టైమ్ గ్రేట్ దిగ్గజాలకు సైతం అభిమానిగా మారిన సచిన్ ఎవరో తెలియదని షరపోవా వ్యాఖ్యానించడంపై అసలెవరీ షరపోవా అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెటైర్ల తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.